Water Board: భారీ వర్షాలు.. అప్రమత్తమైన జలమండలి..
ABN , Publish Date - Jul 17 , 2025 | 10:11 PM
వరద నీటితో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని.. అధికారులు 24 గంటలూ సిబ్బందితో క్షేత్రస్థాయిలో పర్యవేక్షించుకోవాలని అశోక్ రెడ్డి సూచించారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో మ్యాన్ హోళ్ల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, వాటి వద్ద సీవరేజీ సూపర్‌వైజర్లు ఉండేలా చూడాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు.

హైదరాబాద్: నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జలమండలి అప్రమత్తమైంది. ఈ మేరకు అధికారులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అప్రమత్తం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు(ఈఆర్టీ), ఎస్పీటీ వాహనాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తరచూ సీవరేజీ ఓవర్ ఫ్లో అయ్యే మ్యాన్ హోల్స్‌ను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. నీరు నిలిచే ప్రాంతాల్లో ఈ బృందాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
వరద నీటితో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని.. అధికారులు 24 గంటలూ సిబ్బందితో క్షేత్రస్థాయిలో పర్యవేక్షించుకోవాలని అశోక్ రెడ్డి సూచించారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో మ్యాన్ హోళ్ల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, వాటి వద్ద సీవరేజీ సూపర్‌వైజర్లు ఉండేలా చూడాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్ శాఖల అధికారులతో కలిసి ఈఆర్టీ, ఎస్పీటీలు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. నగర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్‌హోల్ మూతలను తెరవకూడదని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సూచించారు.
కాగా మియాపూర్, మూసాపేట్, బాలానగర్, సనత్‌నగర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, నిజాంపేట్, ఎర్రగడ్డ, మాదాపూర్, శేరిలింగంపల్లి, హకీంపేట్, హైటెక్ సిటీ, కొండాపూర్, కంటోన్మెంట్, ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఇవాళ(గురువారం) సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నగర వాసులు కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు మెుత్తం నీరు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కాగా, తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మరో రెండ్రోజులపాటు ఇదే విధంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్