Congress vs BJP: నా ఆట చూపిస్తా... బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్
ABN , Publish Date - Nov 08 , 2025 | 03:10 PM
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్, నవంబర్ 8: కాంగ్రెస్ పాలనలో ప్రజలు అవస్థలు పడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. .. రానున్న రోజుల్లో ఆట మొదలు పెట్టినప్పుడు తానేంటో చూపిస్తానని.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కాళ్ల కింద భూమి కదలాలన్నారు. తెలంగాణ బిడ్డలు బలిదానం చేసింది కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కాదా అని ప్రశ్నించారు. బలిదానం చేసుకున్నది కేసీఆర్ కుటుంబానికి బానిసలుగా ఉండడం కోసం కాదని తెలిపారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు మజ్లిస్ పెత్తనం చేస్తుందని ఆయన ఆరోపించారు.
తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని అన్నారు. తెలంగాణ ప్రజలు అసలైన మార్పు కోరుకున్నారని కేంద్రమంత్రి తెలిపారు. రెక్కాడితే గానీ డొక్కాడని పేదల ఇళ్ళు కూల్చుతామంటే ప్రాణాలు తెగించి బీజేపీ పోరాడుతోందన్నారు. మూసీ పేరుతో పేదల గూడు కూల్చితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సోషల్ మీడియా చూడాలని.. భాష, పద్ధతి మార్చుకోవాలని ఆ రెండు పార్టీల నేతలకు హితవుపలికారు. అలాగే కేటీఆర్, కిషన్‌రెడ్డిని ఉద్దేశిస్తూ బ్యాడ్ బ్రదర్స్ అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కూడా కేంద్రమంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎవరు ఎవరికి బ్రదర్స్ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద బ్రదర్ కేసీఆర్, తర్వాత చిన్న బ్రదర్ హరీశ్ రావు అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకే తాము బ్రదర్స్ అని చెప్పుకొచ్చారు. మునుగోడులో భారత సైనికులను చైనా సైనికులు కొట్టారని కేసీఆర్ అంటే.. జూబ్లీహిల్స్‌లో భారత సైనికులను ముడ్డి మీద తన్నారని రేవంత్ రెడ్డి అంటున్నారని... అసలు పాకిస్థాన్ ఉగ్రవాదులను భారతదేశం ఏం చేసిందో ప్రపంచం అంతా లైవ్‌లో చూసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
రూ.60,799 కోట్లతో కొత్త రోడ్లు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్
మద్యం సేవించి ట్రాక్టర్ కింద పడుకున్నాడు.. తెల్లారేసరికి ఘోరం
Read Latest Telangana News And Telugu News