Share News

Mahesh Kumar Slams Amit: కేంద్రమంత్రి అమిత్ షాపై టీపీసీసీ చీఫ్ ఫైర్

ABN , Publish Date - Jun 30 , 2025 | 12:42 PM

Mahesh Kumar Slams Amit: శాంతి భద్రతలు, దేశ రక్షణ విషయంలో కాంగ్రెస్ రాజీపడే ప్రసక్తే లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కేంద్రంలో ఫాసిస్ట్ మోడీ పాలనకు వ్యతిరేకంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలంగాణకు వస్తున్నారని తెలిపారు.

Mahesh Kumar Slams Amit: కేంద్రమంత్రి అమిత్ షాపై టీపీసీసీ చీఫ్ ఫైర్
Mahesh Kumar Slams Amit

హైదరాబాద్, జూన్ 30: కాంగ్రెస్ పార్టీ గురించి కేంద్ర మంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) చేసిన వ్యాఖ్యలను తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) తీవ్రంగా ఖండించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నక్సల్స్‌ను ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి చెప్పడం విడ్డురంగా ఉందన్నారు. ఆపరేషన్ కగార్ విషయంలో నక్సల్స్‌తో చర్చలు జరపాలని కోరడం తప్పా అని ప్రశ్నించారు. దేశంపై దాడి చేసిన టెర్రరిస్ట్‌ల విషయంలో బీజేపీ ఎలాంటి ధోరణి వ్యవహరించిందో అంతా చూశారన్నారు. ‘ట్రంప్ ఆదేశిస్తే.. టెర్రరిస్ట్‌ల విషయంలో వెనకడుగు వేసిన మీరా మమ్మల్ని విమర్శలు చేసిది’ అంటూ ఫైర్ అయ్యారు.


శాంతి భద్రతలు, దేశ రక్షణ విషయంలో కాంగ్రెస్ రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌తో యుద్ధం చేసి ట్రంప్ చెప్తే మధ్యలో ఆపేశారని దుయ్యబట్టారు. దేశ పౌరులు లెఫ్ట్ ఉద్యమంలో ఉంటే వారితో సీజ్ ఫైర్ చేసి వారితో ఎందుకు చర్చలు జరపరని ప్రశ్నించారు. కేంద్రంలో ఫాసిస్ట్ మోడీ పాలనకు వ్యతిరేకంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలంగాణకు వస్తున్నారని తెలిపారు. జూలై 4నఎల్బీస్టేడియంలో జరిగే గ్రామస్థాయి అధ్యక్షుల సభలో ఖర్గే పాల్గొంటారని తెలిపారు. గ్రామ శాఖ అధ్యక్షులు నుంచి మండల, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాలు రాష్ట్ర స్థాయి నేతల వరకు 25 వేల మంది ఈ సభలో పాల్గొంటారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.


కాగా.. ఎల్బీ స్టేడియంలో జులై 4న ఏర్పాటు చేయనున్న సభ ఏర్పాట్లను ఈరోజు (సోమవారం) కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. జూలై 4న ఎల్బీస్టేడియంలో నిర్వహించనున్న గ్రామస్థాయి అధ్యక్షుల సమ్మేళనం సభకు ఏఐసీసీ చీఫ్ ఖర్గే ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.ఈ సందర్భంగా సభ ఏర్పాట్లను పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిట శ్రీహరి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పరిశీలించారు.


ఇవి కూడా చదవండి

అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తా: రామచందర్‌రావు

యాంకర్‌ స్వేచ్ఛ సూసైడ్‌పై పూర్ణచందర్‌ భార్య షాకింగ్ కామెంట్స్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 30 , 2025 | 12:45 PM