Share News

Mahesh Kumar: ఆ నివేదిక తర్వాతే మహిపాల్‌పై నిర్ణయం

ABN , Publish Date - Jan 24 , 2025 | 04:47 PM

Mahesh kumar: గూడెం మహిపాల్ రెడ్డి మాటలను తీవ్రంగా పరిగణిస్తున్నామని టీపీసీసీ చీఫ్ అన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కమిటీ రిపోర్ట్ ఇస్తుందని.. ఆయన మాటలను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కమిటీ రిపోర్ట్ ఇస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొంత సమస్య ఉందని.. కమిటీ వేశామని తెలిపారు.

Mahesh Kumar: ఆ నివేదిక తర్వాతే మహిపాల్‌పై నిర్ణయం
TPCC chief Mahesh Kumar Goud

హైదరాబాద్, జనవరి 24: ‘‘కేసీఆర్ ఫోటోను పెట్టుకుంటా.. నాకు ఇష్టమైతేనే రేవంత్ రెడ్డి ఫోటో పెడతా ’’ అంటూ పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (MLA Gudem Mahipal Reddy) చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) సీరియస్ అయ్యారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... గూడెం మహిపాల్ రెడ్డి మాటలను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కమిటీ రిపోర్ట్ ఇస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొంత సమస్య ఉందని.. కమిటీ వేశామని.. కమిటీ అన్ని విషయాలపై అధ్యయనం చేస్తుందని పీసీసీ చీఫ్ చెప్పారు.


కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారన్న అంశంపై కూడా కమిటీ అధ్యయనం చేస్తుందని చెప్పారు. పార్టీలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గతంలో ఎమ్మెల్యేల ద్వారానే లబ్దిదారుల ఎంపిక జరిగిందని తెలిపారు. ఏ పార్టీ వాళ్ళు అని తాము చూడడం లేదని.. పెద్దవాళ్ళకి పథకాలు ఇస్తున్నామని వెల్లడించారు. పెట్టుబడి పెట్టడానికి అనేక కంపెనీలు వస్తాయని.. అందులో మేఘా కృష్ణారెడ్డి కంపెనీ ఒకటన్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలో పాత కొత్త ఇబ్బందులు ఉన్నాయన్నారు. అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడిన అంశాలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. కమిటీ పరిశీలన తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటామని పీసీసీ చీఫ్ వెల్లడించారు.

Rajahmundry Airport: రాజమండ్రి ఎయిర్‌పోర్టులో ప్రమాదం


కేటీఆర్‌కు సవాల్..

పెట్టబడులపై ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధం అంటూ మాజీ మంత్రి కేటీఆర్‌కు పీసీసీ చీఫ్ సవాల్ విసిరారు. సీఏం దావోస్ పర్యటన తెలంగాణకు ధమాకా అన్నారు. పెట్టుబడుల విషయంలో తెలంగాణలో ఒక చరిత్ర నెలకొందన్నారు. కాంగ్రెస్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయని మరోసారి నిరూపితమైందని తెలిపారు. విదేశీ పెట్టుబడిదారులకు కాంగ్రెస్‌పై నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్ జవాబుదారీతనంపై పెట్టుబడిదారులకు నమ్మకం ఉందన్నారు. రైజింగ్ 2050 నినాదం గేమ్ చెంజర్‌గా మారిందన్నారు. తనకి తాను సుపర్ స్టార్‌గా చెప్పుకునే కేటీఆర్ పదేండ్లలో ఎన్ని పెట్టుబడులు తెచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్ పదేండ్ల కాలంలో 27 వేల కోట్లు మాత్రమే పెట్టుబడులు తెచ్చారని అన్నారు. కేసీఆర్‌కు విజన్ లేకపోవడం వల్లే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు.


ఇవి కూడా చదవండి..

Dil Raju IT Raids: దిల్‌రాజు ఇంట్లో ముగిసిన సోదాలు.. కీలక అంశాలు వెలుగులోకి

Ponguleti Srinivas: ఎస్పీ ఎక్కడ.. కలెక్టర్, పోలీసులపై పొంగులేటి ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 24 , 2025 | 04:47 PM