Weather Report: తెలంగాణలో భారీ వర్షాలు..
ABN , Publish Date - Apr 16 , 2025 | 04:41 PM
Weather Report: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో వాతావరణంలో తేమ సైతం లేకుండా పోయింది. దీంతో ప్రజలు ఓ విధమైన అసౌకర్యానికి గురవుతున్నారు. అలాంటి వేళ.. వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు ఓ తీపి కబురు చెప్పింది. ఉరుములు, మెరుపుతో వర్షాలు కురుస్తాయిన వాతవరణ కేంద్రం వెల్లడించింది.

హైదరాబాద్, ఏప్రిల్ 16: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో బుధవారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, మరికొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సూచనలున్నాయని పేర్కొంది. రాగల మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందంది. నిన్న నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ.ఎత్తులో కొనసాగిన ఉపరితల చక్రవాత ఆవర్తనం.. ఈ రోజు బలహీన పడిందని వాతావరణ కేంద్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. అయితే ఈ వర్షం ఆగగానే.. మళ్లీ ఎండలు యథావిధిగా వచ్చేశాయి. బుధవారం సైతం హైదరాబాద్ మహానగరంలో ఉదయం నుంచి ఎండలు మండిపోయాయి. మధ్యాహ్నం వరకు ఇదే పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. ఇక వాతావరణంలో తేమ శాతం బాగా తగ్గిపోవడంతో.. ప్రజలు ఓ విధమైన అసౌకర్యానికి గురవుతున్నారు. ఇక నీటి ఎద్దడి సైతం ప్రజలును తీవ్ర ఇబ్బందికి గురి చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Mark Shankar: మార్క్ శంకర్‌పై అసభ్యకర పోస్టులు.. ఒకరు అరెస్ట్
For Telangana News And Telugu News