TGTET: తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల
ABN , Publish Date - Nov 13 , 2025 | 06:21 PM
తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలయింది. నవంబర్ 15వ తేదీ నుంచి అభ్యర్థుల నుంచి ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ దరఖాస్తులు స్వీకరణకు తుది గడువు నవంబర్ 29వ తేదీతో ముగియనుంది.
హైదరాబాద్, నవంబర్ 13: తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలయింది. నవంబర్ 15వ తేదీ నుంచి అభ్యర్థుల నుంచి ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ దరఖాస్తులు స్వీకరణకు తుది గడువు నవంబర్ 29వ తేదీతో ముగియనుంది. జనవరి 3 నుంచి 31వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
కాగా.. 2025 ఏడాదికి సంబంధించి తొలి విడత టెట్ నోటిఫికేషన్ గత జూన్లో విడుదల చేశారు. ఇప్పటికే పరీక్షలు పూర్తి చేయగా.. జులై 22న ఫలితాలు సైతం వెల్లడించారు. తాజాగా రెండో విడత టెట్ నోటిఫికేషన్ ఈ రోజు విడుదల చేశారు. ఇక ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు సైతం టెట్లో అర్హత సాధించాలంటూ ఇప్పటికే సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగాల్లో కొనసాగాలంటే.. టీచర్లంతా ఈ టెట్ పాస్ కావాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
స్టెప్పులేసిన సుధామూర్తి.. వీడియో వైరల్
For More TG News And Telugu News