Share News

Fee Reimbursement: ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌కు 75 శాతం హాజ‌రు తప్పనిసరి

ABN , Publish Date - May 30 , 2025 | 07:14 AM

Fee Reimbursement: ఈసారి త‌ప్ప‌కుండా విద్యార్థుల హాజ‌రును ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌కు ముడిపెట్టి ఆ ఆదేశాల‌ను అమ‌లు చేయాల‌ని ఉప‌కుల‌ప‌తుల స‌మావేశంలో నిర్ణ‌యించారు. దీంతో కొంత‌మేర విద్యానాణ్య‌త పెరుగుతుంద‌ని వీసీలు ఈ సందర్భంగా అభిప్రాయ‌ప‌డ్డారు.

Fee Reimbursement: ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌కు 75 శాతం హాజ‌రు తప్పనిసరి
Fee Reimbursement

Hyderabad: తెలంగాణ‌ రాష్ట్రం (Telangana State)లో డిగ్రీ (Degree)లో ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ (Fee Reimbursement)పై విశ్వవిద్యాల‌యాల‌ ఉప‌కుల‌ప‌తుల స‌మావేశంలో (Higher education, University vice chancellors meeting) కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక‌పై డిగ్రీలో క‌నీసం 75 శాతం హాజ‌రు లేకుంటే ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ పొందేందుకు అర్హ‌త ఉండ‌ద‌ని ఈ సమావేశంలో నిర్ణ‌యించారు. గురువారం రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి కార్యాల‌యంలో ఛైర్మ‌న్ బాల‌కిష్టారెడ్డి ఆధ్వ‌ర్యంలో ఏడు సంప్ర‌దాయ యూనివ‌ర్సిటీల వీసీల స‌మావేశం జ‌రిగింది. ఈ భేటీలో డిగ్రీలో క‌నీసం 75 శాతం హాజ‌రు (75 Percent Attendance) లేకుండా ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌కు అర్హ‌త లేద‌ని గ‌తంలోనే ప్ర‌భుత్వ ఆదేశాలు ఉన్నాయ‌న్నారు. కానీ అవి అమ‌లు కావ‌డం లేద‌ని ఉప‌కుల‌ప‌తులు ప్ర‌స్తావించారు.


కొంత‌మేర విద్యానాణ్య‌త పెరుగుతుంది..

ఈసారి త‌ప్ప‌కుండా విద్యార్థుల హాజ‌రును ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌కు ముడిపెట్టి ఆ ఆదేశాల‌ను అమ‌లు చేయాల‌ని ఉప‌కుల‌ప‌తుల స‌మావేశంలో నిర్ణ‌యించారు. దీంతో కొంత‌మేర విద్యానాణ్య‌త పెరుగుతుంద‌ని వీసీలు ఈ సందర్భంగా అభిప్రాయ‌ప‌డ్డారు. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు మూడేళ్ల డిగ్రీకి 150 క్రెడిట్లు ఉండ‌గా వాటిని 142కు కుదించాల‌ని నిర్ణ‌యించారు.

Also Read: పాక్‌ ర్యాలీలో ‘పహల్గాం’ సూత్రధారి


కాగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య పూరిత ధోరణితో లక్షల మంది పేద విద్యార్థుల భవితవ్యం ప్రమాదంలో పడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు రూ.8,000 కోట్లకు పెరిగిపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను తక్షణం చెల్లించాలంటూ ఆయన రెండు వారాల క్రితం సీఎం రేవంత్‌ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఇకపై నిర్ణీత కాల పట్టిక ప్రకారం వాయిదాల్లేకుండా చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలతో సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేటు కాలేజీలు, అధ్యాపకులకు వేతనాలు చెల్లించలేని దుస్థితి నెలకొందన్న బండి సంజయ్‌.. వేల సంఖ్యలో కాలేజీలు అప్పులతో మూత పడుతున్నాయని గుర్తు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జర్నలిస్టుల అక్రిడేషన్‌ మరో మూడు నెలలు పొడిగింపు

సాహితీ దిగ్గజం గూగీ వా థియాంగో కన్నుమూత

For More AP News and Telugu News

Updated Date - May 30 , 2025 | 07:14 AM