Share News

TG High Court: గ్రూప్ 1 పరీక్షపై అప్పీల్ పిటిషన్ హైకోర్టు విచారణ..

ABN , Publish Date - Apr 30 , 2025 | 12:36 PM

గ్రూప్‌-1 నియామకాలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై టీజీపీఎస్సీ హైకోర్టులో అప్పీల్ పిటీషన్ వేసింది. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థాయం..మళ్ళీ విచారణ జరపాలని, వేసవి సెలవులకు ముందే గ్రూప్ 1 వివాదంఫై తుది ఆదేశాలు ఇవ్వాలని సింగిల్ బెంచ్‌కు హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది.

TG High Court:  గ్రూప్ 1 పరీక్షపై అప్పీల్ పిటిషన్ హైకోర్టు విచారణ..
TG High Court

హైదరాబాద్: గ్రూప్ 1 పరీక్ష (Group 1 exam)పై అప్పీల్ (appeal) చేసిన పిటిషన్‌ (petition)పై బుధవారం తెలంగాణ హైకోర్టు (Telangana High Court) విచారణ జరిపింది. సింగిల్ బెంచ్ (Single bench) ఇచ్చిన మద్యంతర ఉత్తర్వులపై టీజీపీఎస్సీ (TGPSC) సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసింది. గ్రూప్ 1 అభ్యర్థుల నియామకంపై సింగిల్ బెంచ్ ఇప్పటికే స్టే విధించింది. విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దని గతంలో సింగిల్ బెంచ్ టీజీపీఎస్సీకు ఆదేశించింది. దీంతో టీజీపీఎస్సీ పిటిషన్‌పై ఈ రోజు విచారణ జరిపిన హైకోర్టు.. సింగిల్ బెంచ్ మళ్ళీ విచారణ జరపాలని డివిజన్ బెంచ్‌‌ ఆదేశాలిచ్చింది. వేసవి సెలవులకు ముందే గ్రూప్ 1 వివాదంఫై తుది ఆదేశాలు ఇవ్వాలని సింగిల్ బెంచ్‌కు హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది.


కాగా గ్రూప్‌-1 నియామకాలపై హైకోర్టులో టీజీపీఎస్సీ అప్పీల్ పిటీషన్ వేసింది. తెలంగాణలో గ్రూప్‌-1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ధర్మాసనం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను నిలిపివేయాలని తన అప్పీల్ పిటిషన్లో కోరింది. గ్రూప్‌ 1 నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో నియామక ప్రక్రియకు అంతరాయం నెలకున్న సంగతి తెలిసిందే..

Also Read: ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే నిజరూపదర్శనం..


ఫలితంగా గ్రూప్ 1 అభ్యర్థుల నియామకంపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే విధించింది. విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్ 1 నియామక పత్రాలు ఇవ్వొద్దని కోర్టు గతంలో ఆదేశించింది. మెయిన్స్‌ పరీక్షల మూల్యాంకనం సరిగా చేయలేదని, పరీక్ష కేంద్రాల కేటాయింపులోనూ నిబంధనలు పాటించలేదని పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు.

దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం.. నియామకాలు తాత్కాలికంగా నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ధ్రువపత్రాల పరిశీలన చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సీజే ధర్మాసనంలో టీజీపీఎస్సీ ఇప్పుడు అప్పీల్ పిటిషన్‌ దాఖలు చేసింది. సీజే ధర్మాసనంలో అప్పీలు దాఖలు చేసినట్లు టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది సింగిల్ బెంచ్‌కు విన్నవించడంతో ఇదే అంశంపై మంగళవారం జరగాల్సిన విచారణను జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు బుధవారానికి వాయిదా వేశారు. ఈరోజు విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు వెలువరించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

PM Modi: గోడ కూలి ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరం..

సింహాచలం ఘటనపై కేటీఆర్ స్పందన..

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

For More AP News and Telugu News

Updated Date - Apr 30 , 2025 | 01:29 PM