Boy Death: మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న చిన్నారి మృతి
ABN , Publish Date - Feb 22 , 2025 | 02:43 PM
Boy death: లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాబు కథ విషాదంగా ముగిసింది. ఆరేళ్ల చిన్నారి అర్ణవ్ లిఫ్ట్‌లో ఇరుక్కోవడంతో ఎంతో శ్రమంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: నగరంలోని నాంపల్లిలో అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుని తీవ్రంగా గాయపడిన ఆరేళ్ల బాలుడు అర్ణవ్ మృతి చెందాడు. నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బాలుడు మరణించాడు. నిన్న అర్ణవ్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. సమాచారం అందిన వెంటనే డీఆర్‌ఎఫ్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడిని బయటకు తీసి నిలోఫర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే తీవ్ర గాయాలవడంతో చికిత్స పొందుతూనే బాలుడు మృతి చెందాడు. హాస్పిటల్‌కు వచ్చేసరికే బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌తో చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
నిన్న నాంపల్లిలోని శాంతి అపార్ట్‌మెంట్‌లో బాలుడు లిఫ్ట్‌లో ఇరుక్కున్నాడు. డీఆర్‌ఎఫ్ బృందం వచ్చి చాలా సేపు శ్రమించి బాలుడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. లిఫ్ట్‌లో బయటకు వస్తుండగా ఒక కాలు బయట పెట్టే సమయంలో లిఫ్ట్ డోర్ క్లోజ్ అవడంతో బాలుడు మధ్యలో ఇరుక్కుపోయాడు. దీంతో పొట్ట కింద భాగమంతా లిఫ్ట్‌లో ఇరుక్కుపోయింది. అంతేకాకుండా లిఫ్ట్‌లో నుంచి బాలుడిని బయటకు తీసేందుకు దాదాపు 90 నిమిషాలకు పైగా సిబ్బంది శ్రమించారు. దీంతో అప్పటికే బాలుడు అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. వెంటనే నీలోఫర్ ఆస్పత్రికి తరలించగా.. వెంటీలేటర్ మీద బాలుడికి చికిత్స అందించారు.
పరీక్షలు యథాతథం.. తప్పుడు ప్రచారం నమ్మెుద్దు: ఏపీపీఎస్సీ
ఈరోజు తెల్లవారుజామున బాలుడి పరిస్థితి క్రిటికల్‌గా ఉందని వైద్యులు తెలిపారు. కాసేపటి క్రితమే బాలుడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మైండ్‌కు, హార్ట్‌కు ఆక్సిజన్ అందకపోవడం, మల్టీఆర్గన్స్ ఫెయిల్యూర్ అయ్యాయని వైద్యులు తెలిపారు. బాలుడిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించామని మెదడుకు కూడా ఆక్సీజన్ అందకపోవడంతో బాలుడిని కాపాడలేకపోయామని వైద్యులు వెల్లడించారు. మరికాసేపట్లో మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. అయితే అల్లారుముద్దుగా పెంచుకున్న తమ చిన్నారి ఇలా లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి నరకం అనుభవించి చనిపోవడంపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad Property Tax: ప్రాపర్టీ ట్యాక్స్.. బకాయిలు ఎంత పేరుకుపోయాయో తెలిస్తే షాక్ అవుతారు..
Hyderabad: స్వచ్ఛమైన గాలి.. అరగంటకు రూ.5 వేలు
Read Latest Telangana News And Telugu News