Share News

Singer Kalpana: నా భర్త వల్లే బ్రతికి ఉన్నాను..

ABN , Publish Date - Mar 07 , 2025 | 10:22 AM

రెండురోజుల క్రితం అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సింగర్‌ కల్పన ఆరోగ్యం మరింత మెరుగుపడింది. ఈ సందర్భంగా ఆమె మీడియాకు ఓ సంచలన వీడియో విడుదల చేశారు.త్వరలో మళ్లీ పాటలతో మీ ముందుకు వస్తానని చెప్పారు.

Singer Kalpana: నా భర్త  వల్లే  బ్రతికి ఉన్నాను..
Singer Kalpana Sensational video

హైదరాబాద్: రెండురోజుల క్రితం అధిక మోతాదులో నిద్రమాత్రలు (Sleeping Pills) మింగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సింగర్‌ కల్పన (Singer Kalpana) ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆమె తన భర్తపై సోషల్ మీడియా (Social Media)లో తప్పుడు ప్రచారం జరుగుతోందని దాన్ని ఆపేయాలని విజ్ఞప్తి చేస్తూ తాజాగా వీడియో విడుదల (Video Release) చేశారు. తమ కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవని, తన భర్త ప్రసాద్ ప్రభాకర్ వల్లే తాను ఇప్పుడు బ్రతికి వున్నానని, కేవలం ఒత్తిడితో నిద్ర పట్టకపోవడంతో నిద్ర మాత్రలు వేసుకున్నానని చెప్పారు. త్వరలో మళ్లీ పాటలతో మీ ముందుకు వస్తానని చెప్పారు. పోలీసులు.. మీడియా.. సహకరించిన అందరికీ కల్పన ధన్యవాదాలు చెప్పారు.

Read More News..:

రన్యారావు కేసులో సంచలన విషయాలు


‘‘నేను నా భర్త, కుమార్తె సంతోషంగా ఉన్నాం. నేను 45 సంవత్సరాల వయసులో పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌బీ చేస్తున్నాను. నా భర్త సహకారం వల్లే ఇవన్నీ చేయగలుగుతున్నా. ఆయనతో నాకు ఎలాంటి మనస్పర్థలు లేవు. మా కుటుంబం చాలా అన్యోన్యంగా ఉంది. వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా నిద్ర పట్టడం లేదు. దానికోసం చికిత్స తీసుకుంటున్నాను. టాబ్లెట్స్ ఓవర్ డోస్ తీసుకోవడం వల్లే స్పృహ తప్పి పడిపోయాను. నా భర్త సరైన సమయంలో స్పందించడం, కాలనీవాసుల, పోలీసుల సహాయం వల్ల నేను మీ ముందు ఉన్నాను. నా జీవితానికి బెస్ట్ గిఫ్ట్ నా భర్త’’ అంటూ కల్పన వీడియో విడుదల చేశారు.


కాగా సింగర్‌ కల్పన ఆరోగ్యం మరింత మెరుగుపడినట్లు హోలిస్టిక్‌ ఆస్పత్రి వైద్యులు(Holistic Hospital Doctors)తెలిపారు. అపస్మారక స్థితిలో ఆస్పత్రికి వచ్చిన కల్పనకు మొదట పొట్ట మొత్తం శుభ్రం చేయడంతో పాటు శరీరంలోని ఇన్‌ఫెక్షన్‌(Infection)ను వైద్యులు తొలగించామని ప్రస్తుతం ఆమెకు కృత్రిమంగా ఆక్సిజన్‌ అందిస్తున్నామన్నారు. పరిస్థితి మరింత మెరుగుపడితే శనివారం డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు.

Updated Date - Mar 07 , 2025 | 10:29 AM