Share News

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

ABN , Publish Date - May 15 , 2025 | 09:54 AM

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో తీవ్ర కలకలం రేగింది. వెంటనే ఎయిర్‌పోర్టు భద్రతాసిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు
Shamshabad Airport

హైదరాబాద్, మే 15: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Shamshabad Airport) బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది విమానాశ్రయంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. చివరకు బాంబు మెయిల్ ఫేక్ అని తేలింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.


ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టినట్లు అధికారులకు ఒక ఈ మెయిల్‌ ద్వారా సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది కలిసి ఎయిర్‌పోర్టు మొత్తం డాగ్ అండ్ బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. అయితే ఎయిర్‌పోర్టులో ఎలాంటి బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో ఇది పూర్తిగా ఒక ఫేక్‌ మెయిల్‌గా అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం అధికారులు ఈ మెయిల్‌ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పెట్టారు అనే కోణంలో పూర్తిగా దర్యాప్తు చేపట్టారు. తరుచుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఇలాంటి ఫేక్ మెయిల్ రావడంతో పోలీసులు కూడా దీన్ని సీరియస్‌గా తీసుకుని కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేపట్టారు.


ప్రతీ సారి ఇలా బాంబు మెయిల్‌ రావడంతో ఎయిర్‌పోర్టులో భద్రతను కట్టుదిట్టం చేశారు. స్థానిక శాంతిభద్రతల విభాగం, ఇంటలిజెన్స్ విమాశ్రయంలో పూర్తిగా భద్రతను కల్పించారు. ఈనెల (మే) 9న కూడా ఇలాగే శంషాబాద్ ఎయిర్‌పోర్టు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఎయిర్‌పోర్టు అధికారులకు మెయిల్ రావడంతో వెంటనే పోలీసులు, విమానాశ్రయ అధికారులు తనిఖీలు చేపట్టారు. చివరకు ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు.


ఇవి కూడా చదవండి

Heavy Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం..

Saraswati Pushkaralu: సరస్వతి పుష్కరాలు ప్రారంభం.. భారీగా తరలివస్తున్న భక్తులు


Read Latest
Telangana News And Telugu News

Updated Date - May 15 , 2025 | 11:16 AM