Share News

Shalibanda Fire Accident: శాలిబండ అగ్నిప్రమాదం... షాపు యజమాని మృతి

ABN , Publish Date - Nov 26 , 2025 | 10:10 AM

శాలిబండ అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ షాపు ఓనర్ శివకుమార్ మరణించాడు.

Shalibanda Fire Accident: శాలిబండ అగ్నిప్రమాదం... షాపు యజమాని మృతి
Shalibanda Fire Accident

హైదరాబాద్, నవంబర్ 26: పాతబస్తీ శాలిబండలోని గోమతి ఎలక్ట్రానిక్స్ అగ్నిప్రమాద ఘటనలో షాపు యజమాని శివకుమార్ బన్సాల్ మృతి చెందాడు. ఈ ఘటనలో 80 శాతం కాలిన గాయాలతో డీఆర్‌డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివకుమార్.. పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శివకుమార్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. షాపు యజమాని మృతితో గోమతి ఎలక్ట్రానిక్స్ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. అలాగే ఈ ఘటనలో గాయపడిన మరో ఆరుగురు బాధితులు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


కాగా.. సోమవారం రాత్రి 10:30 గంటల సమయంలో గోమతి ఎలక్ట్రానిక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షాపులోని ఎలక్ట్రానిక్ వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ఓ కారు స్పీడ్‌గా వచ్చి షాపును ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగిందని మొదట వాదనలు వినిపించాయి. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయటకు వచ్చాయి. ముందుగా గోమతి ఎలక్ట్రానిక్ షాపులోనే అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. షాపులోని రిఫ్రిజిరేటర్లు, ఏసీ కంప్రెషర్లలో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుళ్ల ధాటికి షాపు బయట పార్క్ చేసి ఉన్న కారు పల్టీలు కొట్టింది. కారు అద్దాలు పగులగొట్టి డ్రైవర్ బయటకు వచ్చేయగా.. ఆ తరువాత మంటలు వ్యాపించి కారు మొత్తం కాలిబూడిదైంది. ఈ ఘటన జరిగిన సమయంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. ఈరోజు షాపు ఓనర్ మరణించాడు.


ఇవి కూడా చదవండి...

బాబోయ్ చిరుత.. భయాందోళనలో ఎస్వీయూ స్టాఫ్

నర్సంపేటలో మందుబాబుల వీరంగం.. ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 26 , 2025 | 10:25 AM