Heart Attack: తెలంగాణ హైకోర్టులో న్యాయవాదికి గుండెపోటు
ABN , Publish Date - Feb 18 , 2025 | 04:26 PM
Senior Lawyer: తెలంగాణ హైకోర్టులో సీనియర్ న్యాయవాది గుండెపోటుతో మరణించారు. కేసు వాదిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు లాయర్ వేణుగోపాల్ రావు.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) విషాదం నెలకొంది. హైకోర్టులో సీనియర్ న్యాయవాది వేణుగోపాల్‌రావు (Senior Lawyer Venugopal Rao) గుండెపోటుకు గురయ్యారు. హైకోర్టులో కేసును వాదిస్తున్న సమయంలో న్యాయవాది ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఆస్పత్రికి తరలించే లోపే మార్గ మధ్యలోనే వేణుగోపాల్ రావు మృతి చెందారు. న్యాయవాది మృతికి సంతాపంగా హైకోర్టులో అన్ని బెంచ్‌లలో జడ్జిలు విచారణను నిలిపివేశారు. అన్ని కోర్టులో విచారణలు రేపటికి వాయిదా వేశారు న్యాయమూర్తులు.
హైకోర్టులో ఈరోజు (మంగళవారం) మధ్యాహ్నం లంచ్ విరామం తర్వాత ఓ కేసు విషయంలో వేణుగోపాల్ తన వాదనలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాదనలు వినిపిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే స్పందించిన తోటి న్యాయవాదులు సీపీఆర్ చేసినప్పటికీ కూడా లాయర్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా మార్గ మధ్యలోనే వేణుగోపాల్ రావు ప్రాణాలు కోల్పోయారు. కేసు వాదిస్తూ పడిపోయిన సమయంలో కళ్లు తిరిగి పడిపోయారని అంతా భావించారు. వెంటనే ఆస్పత్రిక తరలించగా గుండెపోటుతో న్యాయవాది మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. న్యాయవాది మృతి పట్ల న్యాయమూర్తులు విచారం వ్యక్తం చేస్తూ అన్ని విచారణలను వాయిదా వేశారు. సీనియర్ న్యాయవాది మృతితో తోటి లాయర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
తప్పిన పెను విమాన ప్రమాదం.. అసలేం జరిగిందంటే..
భారత్‌లో నియామకాలు ప్రారంభించిన టెస్లా
Read Latest Telangana News And Telugu News