Share News

Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..

ABN , Publish Date - Apr 17 , 2025 | 06:16 PM

Rain Alert: తెలంగాణలో ఎండలు మండుతోన్నాయి. అయితే మరికొన్ని గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో సైతం ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు పడే అవకాశముందని చెప్పింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది.

Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..

హైదరాబాద్, ఏప్రిల్ 17: తెలంగాణలో రాబోయే 3 గంటల్లో వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. మహబూబ్‌నగర్, కామారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ సందర్భంగా వాతావరణ కేంద్రం పలు సూచనలు చేసింది.

ఆయా జిల్లాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తర్ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతోంది.. ఆ సమయంలో పిడుగులు సైతం పడతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణ కేంద్రం సూచించింది. ఇక ఈదురుగాలులు సైతం 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందంది.

ఈ వార్తలు కూడా చదవండి..

Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత

Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

For Telangana News And Telugu News

Updated Date - Apr 17 , 2025 | 06:27 PM