Share News

MeerPet Incident: ఇలాంటి హత్య కేసు ఎప్పటి వరకు చూడ లేదు: సీపీ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 28 , 2025 | 10:23 PM

MeerPet Incident: వెంకట మాధవి హత్య కేసులో గురు మూర్తిని రాచకొండ పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అతడిలో పశ్చాతపం లేదని సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు.

MeerPet Incident: ఇలాంటి హత్య కేసు ఎప్పటి వరకు చూడ లేదు: సీపీ సంచలన వ్యాఖ్యలు
Rachakonda CP Sudheer Babu

హైదరాబాద్, జనవరి 28: మీర్‌పేట హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితుడు గురుమూర్తిని మంగళవారం మీడియా ఎదుట రాచకొండ పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు. వెంకట మాధవి హత్య కేసులో ఆధారాల కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందన్నారు. ఈ హత్యకు ఉపయోగించిన 16 వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

ఇలాంటి కేసు ఇప్పటి వరకు చూడలేదని చెప్పారు. అయితే ఈ హత్యకు పాల్పడిన నిందితుడు గురుమూర్తిలో మాత్రం ఎలాంటి పశ్చా్త్తాపం లేదని పేర్కొన్నారు. ఇక ఈ హత్యకు సంబంధించిన సైంటిఫిక్ ఆధారాలను సైతం సేకరించామని వివరించారు. ఈ కేసులో నిందితుడు గురుమూర్తిపై బీఎన్ఎస్ 103(1), 238, 85 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. గురుమూర్తి గతంలో ఆర్మీలో పని చేశాడన్నారు. అయితే భార్య వెంకట మాధవిని హత్య చేయాలని అతడు ముందే ప్లాన్‌ చేశాడని తెలిపారు.


అందుకోసం పిల్లలను వాళ్ల బంధువుల ఇంట్లో ఉంచాడని తెలిపారు. అయితే వెంకట మాధవిని హత్య చేసిన తర్వాత.. ఆమె డెడ్ బాడీని 8 గంటల పాటు ముక్కలుగా చేసి పౌడర్‌గా మార్చాడన్నారు. ఎముకలు కాల్చిన బూడిదను చెరువులో గురుమూర్తి పడేశారని వివరించారు.

Also Read : ఆయన ఎలాంటి వారో దగ్గర నుంచి చూశా.. సీఎం చంద్రబాబుపై తెలంగాణ మంత్రి కీలక వ్యాఖ్యలు


ఆ తర్వాత సర్ఫ్‌, ఫినాయిల్‌లను ఉపయోగించి.. ఎక్కడ ఆధారాలు లేకుండా చేశాడని రాజకొండ సీపీ సుధీర్ బాబు వివరించారు. మరోవైపు మీర్‌పేట్ హత్య కేసులో పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. అందులోభాగంగా నిందితుడు గురుమూర్తిని ఇంటికి తీసుకెళ్లి పోలీసుల విచారించారు. భార్య వెంకట మాధవిని ఇంట్లోనే దారుణంగా హత్య చేసినట్లు ఒప్పుకొన్నాడు. అలాగే ఆమె డెడ్ బాడీని సైతం ముక్కలుగా చేసినట్లు నేరాన్ని గురుమూర్తి అంగీకరించాడు.

మరిన్ని తెలుగు వార్తల కోసం..

Also Read: మాఘ మాసంలోనే అత్యధిక వివాహాలు.. ఎందుకంటే..

Also Read: ఆ రోజు మహాకుంభమేళకు వెళ్తున్నారా.. ఈ వార్త మీ కోసమే..

Also Read: ఆప్‌కి మద్దతుగా అఖిలేష్ ఎన్నికల ప్రచారం

Also Read: నీ ఇంట్లో నుంచి అవార్డు ఇస్తున్నావా సంజయ్..!

Also Read:ఆర్చర్ జ్యోతి సురేఖకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలి

Also Read: అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు

Also Read: జగన్ నాడు నేడు.. అసలు రహస్యం చెప్పిన కేంద్రం

Also Read: బీజేపీ విజయం కోసం హస్తినకు చంద్రబాబు.. ఆ నియోజకవర్గాల్లో చక్రం తిప్పనున్న సీఎం

For Telangana News And Telugu News

Updated Date - Jan 28 , 2025 | 10:25 PM