Share News

Phone Tapping Case: మరోసారి సిట్ విచారణకు ప్రభాకర్ రావు

ABN , Publish Date - Jun 17 , 2025 | 08:57 AM

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు మంగళవారం మరోసారి సిట్ విచారణకు రానున్నారు. ఇప్పటికే మూడుసార్లు ఆయనను అధికారులు విచారించారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్‌ ట్యాపింగ్‌ అయినట్లు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. దీనికి సంబంధించి..

Phone Tapping Case: మరోసారి సిట్ విచారణకు ప్రభాకర్ రావు
Former SIB chief Prabhakar Rao

Hyderabad: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు (Phone Tapping Case:)లో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను (Investigation) వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు (Former SIB chief Prabhakar Rao) మంగళవారం మరోసారి సిట్‌ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరవుతారు. ఇప్పటికే మూడుసార్లు ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారించారు. మరో వైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ సిట్‌కు వాంగ్మూలం ఇవ్వనున్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఫోన్‌ను ప్రణీత్ రావు టీమ్ ట్యాపింగ్ చేసింది. ప్రణీత్ రావు ఫోన్ డేటలో 400 ఫోన్ నంబర్లు బయటపడ్డాయి. అలాగే గద్వాల మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ సరిత సిట్ ఎదుట వాంగ్మూలం ఇవ్వనున్నారు. గత ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. కాగా బుధవారం ప్రణీత్ రావు సిట్ విచారణకు హాజరుకానున్నారు.


సిట్‌ ఎదుటకు టీపీసీసీ చీఫ్‌..

mahesh.jpg

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దాదాపు 600 మంది ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితులు ఉన్నట్లు ఇప్పటికే తేలటంతో, వారి నుంచి సిట్‌ అధికారులు వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. దీంట్లో భాగంగానే టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ నుంచి వాంగ్మూలం సేకరించేందుకు సిట్‌ సిద్ధమైంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్‌ ట్యాపింగ్‌ అయినట్లు మహేశ్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే, తమ ఎదుట విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా సిట్‌ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. దీంతో మంగళవారం జూబ్లీహిల్స్‌లోని సిట్‌ కార్యాలయానికి మహేశ్‌కుమార్‌ వెళ్లనున్నారు.


కాగా, బాధితుల నుంచి వాంగ్మూలాల సేకరణలో భాగంగా వికారాబాద్‌కు చెందిన ఉమ్మడి రంగారెడ్డి జడ్పీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు పట్లోళ్ల మహిపాల్‌ రెడ్డిని సిట్‌ అధికారులు సోమవారం 45 నిమిషాలపాటు విచారించారు. తొలుత ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు ఎస్ఐలు ప్రాథమికంగా ప్రశ్నించి వివరాలు సేకరించగా, ఆ తర్వాత ఏసీపీ వెంకటగిరి సుమారు అరగంటపాటు విచారించారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ పట్నం మహేంద్‌ రెడ్డి, అప్పటి పీసీసీ చీఫ్‌, ప్రస్తుత సీఎం రేవంత్‌ రెడ్డితో తరచూ మాట్లాడిన కాల్‌ డేటాను ఆయన ముందు ఉంచి ప్రశ్నించారు. ఆయా సమయాల్లో వారితో మాట్లాడింది వాస్తవమేనని మహిపాల్‌ రెడ్డి అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. ఎన్నికల ముందు ఒక ఫోన్‌ నెంబరు ఉపయోగిస్తూ, మరో ఫోన్‌లో వాట్సాప్‌ ఎందుకు వాడాల్సి వచ్చిందని సిట్‌ బృందం ప్రశ్నించగా... అప్పటికే తన ఫోన్‌ ట్యాపింగ్‌ అవుతున్నట్లు సందేహం కలగటంతో భద్రతా కారణాల రీత్యా అలా చేశానని మహిపాల్‌ రెడ్డి సిట్‌ తెలిపినట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి:

ఛార్లెట్‌లో ధీమ్‌ తానా పోటీలు విజయవంతం

పూజలు పేరుతో దారుణం..

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 17 , 2025 | 08:58 AM