Miss World 2025: ఆ దేశపు అమ్మాయిలపై బ్యాన్
ABN , Publish Date - Apr 29 , 2025 | 06:10 PM
Miss World 2025: తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్నాయి. ఇవి మే 7వ తేదీన ప్రారంభం కానున్నాయి. జూన్ 2వ తేదీతో ముగియనున్నాయి. ఈ పోటీలలో ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల నుంచి అందాల భామలు పాల్గొనున్నారు.

హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్నాయి. ఇవి మే 7వ తేదీన ప్రారంభం కానున్నాయి. జూన్ 2వ తేదీతో ముగియనున్నాయి. ఈ పోటీలలో ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల నుంచి అందాల భామలు పాల్గొనున్నారు. అయితే ఒకే ఒక్క దేశం నుంచి అందాల భామలు పాల్గొరనే ఓ చర్చ అయితే వైరల్ అవుతోంది. ఆ ఒక్క దేశమే పాకిస్థాన్. ఎందుకంటే.. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే దేశంలోని పాకిస్థానీలు భారత్ విడిచి వెళ్లేందుకు ఏప్రిల్ 29వ తేదీ తుది గడువుగా నిర్ణయించింది. ఆ క్రమంలో దాదాపుగా పాకిస్థానీలు.. దేశం విడిచి వెళ్లినట్లు ప్రభుత్వం సైతం వెల్లడిస్తోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నడుమ హైదరాబాద్‌లో జరిగే మిస్ వరల్డ్ పోటీలకు పాకిస్థానీ అందాల భామలు ఈ పోటీలో పాల్గొరని సమాచారం.
ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులే లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది మరణించారు. ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన వెనుక పొరుగుదేశం పాకిస్థాన్ ఉందని స్పష్టమైన సాక్ష్యాధారాలను సంపాదించింది. ఈ నేపథ్యంలో పాక్‌పై తీవ్ర ఆంక్షలు విధించింది. పాక్‌తో చేసుకున్న సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది.
అలాగే పాకిస్థానీలు భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించింది. న్యూఢిల్లీలోని పాక్ రాయబారిని సైతం భారత్ విడిచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. అలాగే పాక్‌లో ఉన్న భారతీయులు సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఇక పాక్ సైతం సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది. అలాగే తమ దేశ గగనతలంలో భారత్ విమానాలు వెళ్లకుండా బ్యాన్ విధించింది. అలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఇరు దేశాల నడుమ ఉన్న సమయంలో హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్నాయి. వీటికి పాకిస్థానీ భామలు వచ్చే అవకాశం లేదని స్పష్టమవుతోంది.
ఇవి కూడా చదవండి
Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి
Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు
PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ
For National News And Telugu News..