Share News

Hyderabad: బీజేపీ కార్యాలయంపై దాడి.. ఎంపీ ధర్మపురి అరవింద్ మాస్ వార్నింగ్..

ABN , Publish Date - Jan 07 , 2025 | 07:30 PM

హైదరాబాద్‌లో బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడిని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఖండించారు. గత ప్రభుత్వ సంస్కృతినే ఇప్పుడు కాంగ్రెస్ అవలంబిస్తోందని అరవింద్ మండిపడ్డారు. బీజేపీ శ్రేణులు తిరగబడి దాడి చేస్తే దాచుకోవడానికి కాంగ్రెస్ నేతలకు స్థలం కూడా దొరకదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Hyderabad: బీజేపీ కార్యాలయంపై దాడి.. ఎంపీ ధర్మపురి అరవింద్ మాస్ వార్నింగ్..
Nizamabad MP Dharmapuri Arvind

హైదరాబాద్: నగరంలో బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడిని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఖండించారు. గత ప్రభుత్వ సంస్కృతినే ఇప్పుడు కాంగ్రెస్ అవలంబిస్తోందని అరవింద్ మండిపడ్డారు. బీజేపీ శ్రేణులు తిరగబడి దాడి చేస్తే దాచుకోవడానికి కాంగ్రెస్ నేతలకు స్థలం కూడా దొరకదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో అక్కడి బీజేపీ నేత రమేశ్ బిదూరి.. కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నికల్లో గెలిస్తే కల్కాజీ నియోజకవర్గం రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లా నున్నగా తయారు చేస్తానని మాట్లాడి వివాదాస్పదంగా నిలిచారు. దీనిపై ఆగ్రహించిన తెలంగాణ యూత్ కాంగ్రెస్ నేతలు ఇవాళ (మంగళవారం) ఉదయం హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడిని ఎంపీ అరవింద్ సహా పలువురు తెలంగాణ బీజేపీ నేతలు ఖండిస్తున్నారు.


ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. "బీజేపీ కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నా. గత ప్రభుత్వ సంస్కృతినే కాంగ్రెస్ కొనసాగిస్తోంది. తిరగబడి దాడి చేస్తే తట్టుకోలేరు, పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోనూ ఇలా చేయటం దురదృష్టకరం. ఇది సరైంది కాదు. ప్రజల సొమ్ము దోచుకున్న దొంగ కేటీఆర్. ముఖ్యమంత్రి ఇంకా కేసీఆర్ అనే కేటీఆర్ అనుకుంటున్నారు. చట్టానికి కేసీఆర్ కుటుంబం అతీతులేమీ కాదు. కేసీఆర్‌ని విచారణకు పిలిస్తే ఆయన మందు బాటిల్‌తో వెళ్తారా?. కేటీఆర్, కవిత వల్లనే ఆయన ఆగమయ్యారు. కవిత, కేటీఆర్‌కి ఇంకా అహంకారం తగ్గలేదు. తెలంగాణకు వారిద్దరిలో ఎవరు సీఎం అవుతారో నిర్ణయించుకోవాలి.


తీహార్ జైలు కావాలో లేక చంచల్ గూడా జైలు కావాలో కేటీఆర్ నిర్ణయించుకోవాలి. కేటీఆర్‌ను ఈడీ కూడా పిలిచింది. తప్పించుకొని ఎన్నిసార్లు తిరుగుతారు. కాళేశ్వరం కుంభకోణంలో కమిషన్.. కేసీఆర్, ఈటెల రాజేందర్, హరీశ్ రావును విచారణకు రమ్మని పిలిచారు. ఈటెల ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు నేను రాజకీయాల్లో లేను. అది ఈటెల రాజేంద్రర్‌ను అడిగితే సమాధానం చెప్తారు. అభద్రతా భావంతో ఉన్న కేసీఆర్ ఫ్యామిలీ అరెస్టులకు భయపడుతోంది. గతంలో బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టారు. కవిత ఓడిపోయిందనే ఆనందంలో మా కార్యకర్తలు డీజే పెట్టుకుంటే పీడీ కేసులు పెట్టారు. కవిత ఎక్కువగా నిజామాబాద్‌లో తిరగాలి. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే" అని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Formula E Case: కేటీఆర్‌కు షాక్‌ల మీద షాక్‌లు.. మరోసారి నోటీసులు

KTR: కేటీఆర్ కేసులో హైకోర్టు ఆర్డర్ కాపీలో కీలక అంశాలు

Updated Date - Jan 07 , 2025 | 07:30 PM