Naveen Yadav: గోపీనాథ్ చనిపోకపోయినా బైపోల్ వచ్చేది: నవీన్ యాదవ్
ABN , Publish Date - Nov 26 , 2025 | 03:32 PM
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గోపీనాథ్ చనిపోకపోయినా జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక వచ్చేదని అన్నారు.
హైదరాబాద్, నవంబర్ 25: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ (MLA Naveen Yadav) ప్రమాణస్వీకారం స్వీకారం చేశారు. స్పీకర్ కార్యాలయంలో నవీన్ చేత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ దినోత్సవం రోజు ప్రమాణ స్వీకారం చేయడం తన అదృష్టమన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలపెట్టుకుంటానని తెలిపారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం పని చేస్తానని.. ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గంలోని స్థానిక సమస్యలు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు.
సోషల్ మీడియాలో తనతో పాటు కుటుంబ సభ్యులను వ్యక్తిగత టార్గెట్ చేశారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ గెలుపు ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై నమ్మకానికి మరింత పెంచిందన్నారు. మాగంటి గోపీనాథ్ చనిపోక పోయినా జూబ్లీహిల్స్‌లో బైపోల్ వచ్చేదన్నారు. కేసు కోర్టులో ఉన్న సమయంలోనే గోపీనాథ్ కాలం చేశారని చెప్పుకొచ్చారు. గోపీనాథ్‌పై వేసిన కేసును వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. ఉప ఎన్నికల్లో మద్దతు తెలిపిన ఎంఐఎం పార్టీకి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి...
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన నవీన్ యాదవ్
రేవంత్ ఇంటి పేరు అనుముల కాదు అనకొండ: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News