Share News

Supreme Court: మరికొన్ని గంటల్లో.. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పు

ABN , Publish Date - Jul 30 , 2025 | 09:54 PM

పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేయలేదు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది.

Supreme Court: మరికొన్ని గంటల్లో.. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పు
Supreme Court

న్యూఢిల్లీ, జులై 30: ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై రిజర్వు చేసి ఉంచిన తీర్పును సుప్రీంకోర్టు గురువారం వెలువరించనుంది. జస్టిస్ బిఆర్ గవాయ్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇవ్వనుంది. పార్టీలు మారిన ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీ స్పీకర్‌కి కోర్టులు సూచనలు చేసే అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. అందుకు సంబంధించిన తీర్పును ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీన జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం రిజర్వు చేసింది.

ఆ రిజర్వు చేసిన తీర్పును రేపు.. అంటే గురువారం సుప్రీం ధర్మాసనం వెలువరించనుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌తోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కెపి వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది.


2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున విజయం సాధించిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పది మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు స్పీకర్‌ను కోరినా.. స్పందన లేదు.


ఈ నేపథ్యంలో వారిపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ తరహా అంశంలో స్పీకర్‌కు పలు సూచనలు చేసే అంశంపై ఇప్పటికే కోర్టులో పలు వాదనలు జరిగాయి. దీంతో ఈ తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసి ఉంచింది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఈడీ అధికారులతో ముగిసిన ప్రకాష్ రాజ్ విచారణ

గుడ్ న్యూస్.. రేవంత్ ప్రభుత్వం మరో కీలకనిర్ణయం.. వాటికి గ్రీన్ సిగ్నల్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 09:56 PM