Share News

Danam Nagender serious statement: నేను సీనియర్‌‌ను.. మీరు చెప్తే నేను వినాలా.. దానం ఫైర్

ABN , Publish Date - Mar 18 , 2025 | 12:32 PM

Danam Nagender serious statement: తాను సీనియర్ ఎమ్మెల్యేను అని... తనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. సహచర ఎమ్మెల్యేలపైనే దానం ఈ వ్యాఖ్యలు చేశారు.

Danam Nagender serious statement: నేను సీనియర్‌‌ను.. మీరు చెప్తే నేను వినాలా.. దానం ఫైర్
MLA Danam Nagender serious statement

హైదరాబాద్, మార్చి 18: తెలంగాణ అసెంబ్లీలో (Telangana Assembly) సహచర ఎమ్మెల్యేలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Khairatabad MLA Danam Nagender) సీరియస్ అయ్యారు. తాను సీనియర్ ఎమ్మెల్యేని, తనకి ఏం మాట్లాడాలో తెలుసని అన్నారు. ఏం మాట్లాడాలో తనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అనేక సందర్భాల్లో క్యాంపు ఆఫీస్‌కు స్థలం కావాలని విజ్ఞప్తి చేశానని.. తన విజ్ఞప్తి పక్కన పెట్టి వేరే వేరే ఆఫీస్‌కు శంకుస్థాపన చేశారని అన్నారు. అందుకే శిలాఫలకం కూలగొట్టిన్నట్లు తెలిపారు. ఈడబ్ల్యూఎస్ కాలనీలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. దీనిపై జీహెచ్‌ఎంసీ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ పట్టించుకోవటం లేదని అన్నారు. సోషల్ మీడియాకు భయపడి వెంటనే రెస్పాండ్ అయ్యే అధికారులు ఎమ్మెల్యే ఫిర్యాదుకు స్పందించటం లేదని సభలో ఎమ్మెల్యే పేర్కొన్నారు.


దానం ఏమన్నారంటే..

‘నాకు సంబంధించి.. నా క్యాంప్ ఆఫీసు గురించి గత పదిహేను నెలల నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. మేము అడిగిన క్యాంప్ ఆఫీసు గురించి రెవెన్యూ డిపార్ట్‌మెంట్ వద్ద సమాచారం లేదు. జీహెచ్‌ఎంసీ వద్ద సమాచారం లేదు. ఇది ఆశ్చర్యకరమే. మా నియోజకవర్గం రోడ్ నెంబర్ 10లో ఈద్గా గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్‌ ఒక సబ్‌స్టేషన్ గురించి ల్యాండ్ అలాట్‌మెంట్ ఇచ్చారు. ఇప్పుడు రంజాన్ నడుస్తోంది. ఈద్గా గ్రౌండ్‌లో నాకు క్యాంప్ ఆఫీసుకు స్థలం ఇవ్వమంటే ఐడెంటిఫై చేయలేకపోయారు. సబ్‌ స్టేషన్‌కు నా ప్రమేయం లేకుండానే శంకుస్థాపన చేశారు. నా రెగ్యులర్ స్టైల్‌లో శిలాఫలకాన్ని పలగొట్టాను’ అని అన్నారు.


‘నేను మంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాన చేసి ఈడబ్ల్యూఎస్ కాలనీ కట్టించాను. ఆ కాలనీలో ఓ వ్యక్తి.. కొందరికి డబ్బులు ఇచ్చి అక్కడి ఇళ్లను లాక్కున్నాడు. దాదాపు ఆరు ఫ్లోర్లతో ఇళ్లు కట్టాడని.. ఈ విషయంపై జోనల్ కమిషన్‌కు ఫిర్యాదు చేశాను. ఎమ్మార్వో, తహశీల్దార్, డీసీకి విషయాన్ని తెలియజేశాను. అయినప్పటికీ యాక్షన్ తీసుకోలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చాను.. ఇది నా బాధ్యత’ అని ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

Arrest: యువతులను వ్యభిచార కూపంలోకి దింపుతున్న మహిళ అరెస్టు..

DK Aruna Home Theft Case: డీకే అరుణ ఇంట్లో చోరీ కేసులో కీలక పరిణామం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 18 , 2025 | 04:11 PM