Share News

Divyanguralu: హైదరాబాద్‌లో దారుణం.. దివ్యాంగురాలిపై లైంగిక దాడి

ABN , Publish Date - Jul 20 , 2025 | 07:44 PM

రాచకొండ కమిషనరేట్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. దివ్యాంగురాలిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను వేధింపులకు గురి చేశాడు ఓ దర్మార్గుడు. దీంతో ఆమె ఆత్యహత్య చేసుకుంది.

Divyanguralu: హైదరాబాద్‌లో దారుణం.. దివ్యాంగురాలిపై లైంగిక దాడి

హైదరాబాద్, జులై 20: రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని మీర్ పేట్ పోలీస్ స్టేషన్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. దివ్యాంగురాలైన చెవిటి, మూగ యువతిపై యువకుడు అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను తరచూ వేధింపులకు గురి చేశాడు. వాటిని తాళ లేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లాకు చెందిన ఒక కుటుంబం బతుకుతెరువు నిమిత్తం హైదరాబాద్‌ ఆల్మాస్ గూడలో ఉంటుంది.


సదరు కుటుంబ యజమానికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆ ఇద్దరు కుమార్తెలు దివ్యాంగురాళ్లు. వీరి నివాసానికి ఎదురుగా శ్రీకాంత్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. సదరు అక్కచెల్లెళ్లలో పెద్ద అమ్మాయి(21)తో శ్రీకాంత్ పరిచయం పెంచుకున్నాడు. ఆ క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేశాడు.


ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించారు. అంతేకాదు.. ఆమెపై తరచూ వేధింపులకు గురి చేసే వారు. ఈ విషయాన్ని బాధితురాలి సోదరి గమనించింది. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పమని అక్కకు ఆమె సూచించింది. అయితే అతడు తనపై ఏ విధంగా లైంగిక దాడి జరిపింది. తనపై తరచూ వేధింపులకు పాల్పడుతున్న తీరును తన సోదరికి బాధితురాలు వివరించింది.


అనంతరం బాత్ రూమ్‌లో ఆమె ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఈ ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని.. ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు శ్రీకాంత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు బాధితురాలి సోదరి చెప్పిన ఘటనల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు

ఇంటర్మీడియట్ విద్యార్థులకు తల్లికి వందనం నిధులు విడుదల

For More Telangana News And Telugu News

Updated Date - Jul 20 , 2025 | 09:06 PM