Maganti Funeral: అధికారిక లాంఛనాలతో మాగంటి అంత్యక్రియలు..
ABN , Publish Date - Jun 08 , 2025 | 11:06 AM
Maganti Gopinath funeral: ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అంతిమ సంస్కారాలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించనుంది. మరోవైపు ఏఐజీ హాస్పిటల్ నుంచి మాగంటి గోపీనాథ్ పార్ధి దేహాన్ని మాదాపూర్ కావూరి హిల్స్‌లోని మాగంటి నివాసానికి తరలించారు.

Hyderabad: ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (MLA Maganti Gopinath) అంతిమ సంస్కారాలను (Funeral) ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో (Official Honors) నిర్వహించనుంది. మరోవైపు ఏఐజీ హాస్పిటల్ (AIG Hospital) నుంచి మాగంటి గోపీనాథ్ పార్దివ దేహాన్ని మాదాపూర్ కావూరి హిల్స్‌లోని మాగంటి నివాసానికి తరలించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఆస్పత్రికి చేరుకుని గోపీనాథ్ భౌతికకాయాన్ని అక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు మాగంటి నివాసానికి తరలి వస్తున్నారు.
ఎమ్మెల్సీ కవిత సంతాపం..
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆయన అకాల మరణం హైదరాబాద్ నగర ప్రజలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని, మాగంటి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని.. శోఖార్తులైన ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని కవిత అన్నారు.
మాగంటితో 40 ఏళ్ల అనుబంధం...
కూకట్‌ల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి బాధాకరమని.. ఆయనతో తనకు 40 సంవత్సరాల అనుబంధం ఉందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నుంచి తామిద్దరం కలిసి పని చేశామని.. గత నెల 22వ మాగంటి చివరిగా తనతో మాట్లాడారని తెలిపారు. ఆరోగ్య సమస్యల గురించి చెబుతూ చాలా ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. మంచి రాజకీయ నాయకుడిని కోల్పోయామని, గోపీనాథ్ మృతి పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
రావుల సంతాపం..
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణం అత్యంత బాధాకరమని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని రాజ్యసభ మాజీ సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. మాగంటి మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని, రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన ఆయన జీవితం ఆదర్శమని అన్నారు. గోపినాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని రావుల చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం పట్ట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
పట్టరాని కోపంతో రగిలిపోతున్న జగన్
బీచ్ ఫెస్టివల్‌కు ఊహకు అందని విధంగా పర్యాటకులు..
For More AP News and Telugu News