Share News

Falcon Scam: ఫాల్కన్‌ స్కాం.. చైర్మన్‌పై లుకౌట్ నోటీసులు జారీ

ABN , Publish Date - Feb 21 , 2025 | 02:41 PM

Lookout notice: ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈకేసులో ప్రధాన నిందితులకు పోలీసులు లకౌట్‌ నోటీసులు జారీ చేశారు.

Falcon Scam: ఫాల్కన్‌ స్కాం.. చైర్మన్‌పై లుకౌట్ నోటీసులు జారీ
Falcon Scam Case

హైదరాబాద్, ఫిబ్రవరి 21: పెట్టుబడుల పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడిన ఫాల్కన్ చైర్మన్ అమర్‌దీప్ కుమార్‌పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఫాల్కన్ స్కాం కేసును సైబరాబాద్ పోలీసులు.. ఈడీకి రిఫర్ చేశారు. దేశవ్యాప్తంగా రూ.1700 కోట్లు వసూలు చేశారు అమర్‌దీప్‌కుమార్‌. చిన్న పెట్టుబడులను పెద్ద కంపెనీల్లో పెట్టి అధిక లాభాలంటూ మోసాలకు పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు అవగానే అమర్ దీప్‌ కుమార్ దుబాయ్ పారిపోయాడు. దీంతో పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. దుబాయ్‌ చెక్కేసిన ఫాల్కన్‌ ఎండీ, సీఈవో, సీఓలకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టులలో అధికారులను అప్రమత్తం చేశారు.


ఫాల్కన్ స్కీమ్‌లో స్కామ్‌ జరిగిందని సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఈకేసులో ఈవోడబ్ల్యూ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. దాదాపు రూ.1700 కోట్లు పెట్టబడుల రూపంలో ఆకర్షించారని.. ఆ డబ్బుల విదేశీ కంపెనీలకు జమ చేశారా లేక ఎక్కడైనా దాచిపెట్టారనే అంశాలపై ఆరా తీస్తున్నారు. అలాగే ఈ కేసును ఈఓడబ్ల్యూ అధికారులు.. ఈడీకి రిఫర్ చేశారు. ఇందులో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈవోడబ్ల్యూ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా చేసుకుని పోలీసుల విచారణలో వెల్లడైన అంశాలను ఈడీ అధికారులకు అందజేసే అవకాశం ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితులు అమర్‌దీప్‌ కుమార్ దుబాయ్‌కు పారిపోయినట్లు ఈవోడబ్ల్యూ అధికారులు నిర్ధారణకు వచ్చారు. దీంతో ఎండీ, సీఈవో, సీఓలపై లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు.

Phone Tapping Case: ఫోన్‌ట్యాపింగ్ కేసు.. వంశీ కృష్ణ సంచలన వ్యాఖ్యలు


దాదాపు 14 షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి డబ్బులు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో చాలా మంది ఆర్మీ ఆఫీసర్లు, ఐటీ ఉద్యోగులు, డాక్టర్లు పెట్టుబడులు పెట్టి మోసపోయినట్లు బయటపడింది. ఒక్కొక్కరు రెండు, మూడు కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ డబ్బులతోనే జల్సాలకు పాల్పడ్డాడని, చార్టెడ్ ఫ్లైట్ కొని విదేశాల్లో అమర్‌ దీప్ కుమార్ తిరిగినట్లు గుర్తించారు. సైబరబాద్‌ కమిషనరేట్ పరిధిలో ఓ ఆఫీసును ఏర్పాటు చేసి అక్కడి నుంచే లావాదేవీలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టి మోసపోయినా వారు ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుతామని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఫాల్కన్‌లో డైరెక్టర్లుగా పని చేసిన హైదరాబాద్, ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించారు. అయితే ప్రధాన నిందితులు మాత్రం దేశం విడిచి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.


ఇవి కూడా చదవండి...

2047 నాటికి అధిక ఆదాయ దేశంగా భారత్‌

తాజ్‌ బంజారా హోటల్‌‌కు షాక్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 21 , 2025 | 02:41 PM