Telangana Govt Kurnool Bus Fire: కర్నూలు ప్రమాదంపై సర్కార్ స్పందన.. హెల్ప్‌లైన్ ఏర్పాటు
ABN , Publish Date - Oct 24 , 2025 | 10:07 AM
బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 24: కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. హెల్ప్‌లైన్ పర్యవేక్షణకు ప్రోటోకాల్ విభాగం డైరెక్టర్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే సహాయ చర్యల కోసం అధికారులను నియమించింది ప్రభుత్వం. బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
హెల్ప్ లైన్ నెంబర్లు ఇవే..
ఎం. శ్రీరామ చంద్ర, సహాయ కార్యదర్శి – 9912919545
ఇ. చిట్టి బాబు, సెక్షన్ ఆఫీసర్ – 9440854433
గచ్చిబౌలి నుంచి ఇద్దరు...
ఇక.. కావేరి ట్రావెల్స్ బస్సులో గచ్చిబౌలి నుంచి బెంగళూరుకు ఇద్దరు ప్రయాణికులు ప్రయాణించినట్లు తెలుస్తోంది. శివ, గ్లోరియా హెల్స సామ్ అనే ఇద్దరు ప్రయాణికులు ప్రమాదం జరిగిన బస్సులో ఉన్నారు. అయితే శివ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడగా... మరో ప్రయాణీకురాలు గ్లోరియా హెల్స సామ్ పరిస్థితి తెలియాల్సి ఉంది.
కాగా.. హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లాలో ప్రమాదానికి గురైంది. బస్సును బైక్ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. బస్సులోని ప్రయాణికుల్లో పలువురు సజీవ సమాధి అవగా.. మరికొందరు బయటకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ ప్రమాద ఘటన రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనా స్థలంలో అధికారులు, పోలీసుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి...
ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి.. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా
బస్సు ప్రమాదంపై కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు.. నంబర్లివే..
Read Latest Telangana News And Telugu News