Share News

Ramachander Rao Statement: కర్నూలు ప్రమాదం... ట్రావెల్స్ సంస్థలపై రామచందర్ రావు సీరియస్

ABN , Publish Date - Oct 24 , 2025 | 10:50 AM

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని, ప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య చికిత్సను ప్రభుత్వం వెంటనే అందించాలని రామచందర్ రావు కోరారు.

Ramachander Rao Statement: కర్నూలు ప్రమాదం... ట్రావెల్స్ సంస్థలపై రామచందర్ రావు సీరియస్
Ramachander Rao Statement

హైదరాబాద్, అక్టోబర్ 24: కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు (Telangana BJP Chief Ramachander Rao) స్పందించారు. హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురైన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని, ప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య చికిత్సను ప్రభుత్వం వెంటనే అందించాలని కోరారు.


ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు మరల జరగకుండా ప్రభుత్వం సమగ్ర నియంత్రణ చర్యలు చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని రామచందర్ రావు వెల్లడించారు.


విషాదకరం: బీజేపీఎల్పీ నేత

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్ ఘటనలో ఎక్కువ సంఖ్యలో మృతులు ఉండటం విషాదకరమన్నారు. మృతులకు తీవ్ర సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన చికిత్స అందించాలన్నారు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి.. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా

బస్సు ప్రమాదంపై కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు.. నంబర్లివే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 24 , 2025 | 12:23 PM