KTR: ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు మంచి పనులు చేశారు..
ABN , Publish Date - Apr 20 , 2025 | 12:47 PM
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి పనులు చేశారని కేటీఆర్ కొనియాడారు.

హైదరాబాద్: ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu)కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (Ex Minister KTR) జన్మదిన శుభాకాంక్షలు (Birthday Greetings) తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మంచి పనులు చేశారన్నారు. చంద్రబాబు తీసుకొచ్చిన హైటెక్ సిటీ సహా.. ఐటీ అభివృద్ధిని తాము కొనసాగించామని చెప్పారు. మంచి పనులను బీఆర్ఎస్ ఎప్పుడూ అడ్డుకోలేదని ఆయన స్పష్టం చేశారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కేసీఆర్ ఆనవాళ్ళను చెరిపేస్తానంటున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read..: చంద్రబాబు విజన్ ఎంతో గొప్పది..
కాంగ్రెస్ మాయమాటలు..
కాంగ్రెస్ చెప్పిన మాయమాటలకు రాష్ట్రంలో ఆడబిడ్డలు,రైతులు, వృద్ధులు మోసపోయారని, అశోక్ నగర్ వచ్చి రాహుల్ గాంధీ ఫోజులు కొట్టి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే యువత మోసపోయిందని కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి,భట్టి విక్రమార్కను ఎవరూ నమ్మడం లేదని ఖర్గే,రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ, సిద్ధ రామయ్య,సోనియాగాంధీని పిలిచి హామీలు ఇప్పించారని తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్‌ను గెలిపించి తినే పళ్లెంలో మన్ను పోసుకున్నామన్నారు. వైఎస్ ఆరోగ్యశ్రీ అనే మంచి పధకం పెట్టండని అసెంబ్లీలో కేసీఆర్ అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇప్పుడు ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీ అంటున్నారు..
‘‘ఆనవాళ్లు తుడిచివేస్తామంటే రాజరికం అన్నట్లే లెక్క.. కాకతీయులు తవ్విన చెరువులను పూడుస్తారా.. ఐదు వందల రోజుల్లో ఒక్క హామీ నెరవేర్చారా... బస్సులో మహిళలకు ఫ్రీ పెట్టారు.. ఆడబిడ్డలు బస్సుల్లో తన్నుకునే పరిస్థితి వచ్చింది.. రేవంత్ రెడ్డి కొత్త అత్తా,కొడళ్లకు పంచాయతీ పెట్టారు.. కేసీఆర్ పాలనలో రియల్ ఎస్టేట్ దందా జరగలేదు.. హైడ్రాతో పొంగులేటి ఇళ్లు, పట్నం మహేందర్ రెడ్డి, కె.వి.పి,రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇళ్లు కూలగొట్టరు.. రేవంత్ రెడ్డి నెగిటివ్ పనులు చేస్తున్నారు.. సీఎం కాగానే ఎయిర్ పోర్టుకు మెట్రోను రద్దు చేశారు.. నా భూములు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఎయిర్ పోర్ట్ మెట్రో రద్దు చేశారు అంట.. ఫార్మా సిటీ రద్దు అన్నారు.. ఇప్పుడు ఫోర్త్ సిటీ,ఫ్యూచర్ సిటీ అంటున్నారు.. మూసీకి లక్షన్నర కోట్లు ఖర్చు పెడతానని రేవంత్ రెడ్డి అంటున్నారు.. రేవంత్ రెడ్డికి ఫోజులు ఎందుకు.. ఆహా నా పెళ్ళంట సినిమాలో కోడి కథలా రేవంత్ రెడ్డి పనితీరు ఉంది.. ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఇందిరమ్మ ఇళ్ళు అని రెండు బడ్జెట్‌లో పెట్టారు. కేసీఆర్ హయాంలో కేంద్ర ప్రభుత్వం నుండి 30 శాతం అవార్డులు గెలుచుకున్నాం..
దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకం..
బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణ సమాజానికి ఎక్కువ నష్టం జరిగింది.. కేసీఆర్‌ను మరోసారి సీఎం చేసుకొవడం తెలంగాణ ప్రజల చారిత్రక అవసరం... ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో రెండు ప్రాంతీయ పార్టీలు మాత్రమే.. ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ,కేసీఆర్ స్థాపించిన బిఆర్ఎస్ పార్టీలు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో నిలబడ్డాయి. మతం పిచ్చి లేపుడు తప్ప బీజేపీ చేసింది ఏం లేదు.. బడే భాయ్ మోదీ నాయకత్వంలో దేశం... చోటే భాయ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం వెనక్కిపోతుంది.. మోదీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు.. ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా మోదీ ఇవ్వలేదు. లోయర్ సీలేరు ప్రాజెక్టును మోదీ గుంజుకున్నారు.. దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకం
కాంగ్రెస్,బీజేపీ ఒక్కటే..
2014 దాక హిందువులు ప్రమాదంలో లేరు ఇప్పుడు మోదీ అధికారంలోకి వచ్చాక హిందువులు ప్రమాదంలో ఉన్నారా.. హిందువులు ప్రమాదంలో ఉన్నారని బీజేపీ అంటే మోదీ ప్రధానిగా ఫెయిల్ అయినట్లే హిందూ,ముస్లిం,మోదీ.. జై శ్రీరాం అనకుండా ఓట్లు అడిగే దమ్ము బీజేపీకి ఉందా.. కాంగ్రెస్,బీజేపీ ఒక్కటే.. తెలంగాణలో రాహుల్,రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మోదీ అన్నారు.. రేవంత్ రెడ్డి తన బామ్మర్ది కంపెనీకి అర్హత లేకపోయినా.. అమృత్ టెండర్లు కట్టబెట్టారు.. నేను కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఈడీ రైడ్స్ జరిగితే వివరాలు బయటకు రాలేదు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్ షీట్ వేస్తే రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారు. రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలకు ఇది సంకేతమా... రెండు పార్టీలు ఒక్కటి అయ్యాయా అనేది తెలంగాణ ప్రజలు ఆలోచించాలి.. బీఆర్ఎస్ పాలనలో ఏం తప్పు జరిగింది... బీఆర్ఎస్ ఎందుకు ఖతం కావాలి...
మూసీ పేరుతో ఇళ్ళు కూలగొడుతుంటే..
మూసీ పేరుతో ఇళ్ళు కూలగొడుతుంటే అడ్డుకున్నది గులాబీ జెండా.. లగచర్ల గిరిజన రైతుల కోసం పోరాటం చేసింది గులాబీ జెండా.. హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల నుండి పెద్దఎత్తున కార్యకర్తలు వరంగల్ సభకు తరలిరావాలి.. చేవెళ్ల,రాజేంద్రనగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఖాయం.. ఏప్రిల్ 27న ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ జెండా ఎగురవేయాలి.. రేవంత్ రెడ్డి కూలగొట్టే గుంపు మెస్త్రీ.. ఏప్రిల్ 27 బహిరంగ సభతో కాంగ్రెస్,బీజేపీ పార్టీల గుండెలు జారాలి’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
MP Kesineni Chinni: చంద్రబాబు ఈ రాష్ట్రానికే కాదు దేశానికే వరం..
టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు..
ఏపీ చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
For More AP News and Telugu News