Share News

Seethakka Comments: జైలుకు వెళ్లాలని కేటీఆర్‌కు ఆరాటం.. మంత్రి సీతక్క సెటైర్

ABN , Publish Date - Jun 16 , 2025 | 03:16 PM

Seethakka Comments: మాజీ మంత్రి కేటీఆర్ పొగరుతో మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఏదో ఆశించి కేటీఆర్ జైలుకు పోవాలని అనుకుంటున్నారని అన్నారు.

Seethakka Comments: జైలుకు వెళ్లాలని కేటీఆర్‌కు ఆరాటం.. మంత్రి సీతక్క సెటైర్
Seethakka Comments

హైదరాబాద్, జూన్ 16: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై (BRS Working President KTR) మంత్రి సీతక్క (Minister Seethakka) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌ జైలుకు పోవాలని కుతూహలంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. వీలైనంత త్వరగా జైలుకు పంపించాలని సీఎం రేవంత్ రెడ్డిని రెచ్చగొడుతున్నారని అన్నారు. కేటీఆర్, కవిత మధ్య పోటీ ఉందని తెలిపారు. కవిత జైలుకు పోయివచ్చి బీసీ ఎజెండా ఎత్తుకున్నారని.. తాను వెనకబడ్డానని భావించి కేటీఆర్ కూడా జైలుకు పోయి పథకం రచించాలని అనుకుంటున్నారని సెటైర్ విసిరారు. కేటీఆర్ పొగరుతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.


ఏదో ఆశించి కేటీఆర్ జైలుకు పోవాలని అనుకుంటున్నారన్నారు. తోడేళ్ళలా దోచుకుని... ఇప్పుడు వినయం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ‘కేటీఆర్ పొగరుతో మాట్లాడుతున్నారు .. మా సీఎం పౌరుషంతో మాట్లాడుతున్నారు’ అని అన్నారు. కేటీఆర్ వ్యవహరాన్ని దర్యాప్తు సంస్థలే చూసుకుంటాయని తెలిపారు. ఈరోజు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఐసీసీసీలో జరుగనున్న మంత్రివర్గ సమావేశంలో పంచాయతీ ఎన్నికలపై స్పష్టత వస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.


కాగా.. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. విచారణకు ముందు కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇప్పటికి మూడు సార్లు విచారణకు పిలిచారని, ముప్పైసార్లు విచారణకు పిలిచినా హాజరవుతానన్నారు. తనను ఏసీబీ విచారణకు పిలిచి రాక్షసానందం పొందుతున్నారని, అవసరమైతే తనను అరెస్ట్ కూడా చేయొచ్చంటూ వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ తనకు జైలు, కేసులు కొత్తేమీ కాదని తెలంగాణ ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లి వచ్చానంటూ మాజీ మంత్రి ట్వీట్ చేశారు. జైలు గురించి కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపైనే మంత్రి సీతక్క సెటైరికల్ కామెంట్స్ చేశారు.


ఇవి కూడా చదవండి

ములుగు జిల్లాలో ఉద్రిక్తత..

ఫార్ములా ఈ రేస్ కేసు.. ఏసీబీ ఎదుటకు కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 16 , 2025 | 04:15 PM