Share News

key meetings: సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పలు కీలక సమావేశాలు

ABN , Publish Date - Jun 24 , 2025 | 08:00 AM

TG News: సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతే అజెండాగా మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాలు, సలహా కమిటీల ఉమ్మడి భేటీ జరగనుంది. ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన నేతలకు నియామక పత్రాలు అందజేస్తారు.

key meetings: సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పలు కీలక సమావేశాలు
CM Revanth Reddy

Hyderabad: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆధ్వర్యంలో మంగళవారం గాంధీ భవన్‌ (Gandhi Bhavan)లో పలు కీలక సమావేశాలు (Key meetings) జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు క్రమశిక్షణ కమిటీ మీటింగ్ (disciplinary committee meeting) జరగనుంది. ఈ భేటీకి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), మల్లు రవి (Mallu Ravi) తదితరులు హాజరవుతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా వరంగల్ ఎపీసోడ్‌పై చర్చ జరగనున్నట్లు తెలియవచ్చింది.


పొలిటికల్ అఫైర్స్ కమిటీ

మంగళవారం ఉదయం 11 గంటలకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరుగుతుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. మధ్యాహ్నం పీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం, తర్వాత టీపీసీసీ నూతన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల భేటీ జరుగుతుంది. ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన నేతలకు నియామక పత్రాలు అందజేస్తారు. కాగా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశ ఎజెండాను గాంధీ భవన్ సిబ్బంది సిద్ధం చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలపై చర్చలు జరగనున్నట్లు సమాచారం.


స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతే అజెండాగా..

స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతే అజెండాగా మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, ఇరు కమిటీల సభ్యులూ పాల్గొననున్నారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేయడానికి సాంకేతికంగా ఇబ్బందులు ఏర్పడితే.. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం టికెట్లు ఇచ్చే అంశంపైనా చర్చించి విధానపర నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. అలాగే వివిధ పత్రికల్లో మహేశ్‌ గౌడ్‌ రాసిన వ్యాసాల సంకలనం.. ‘విధ్వంసం నుంచి వికాసం వైపు’ పుస్తక ఆవిష్కరణ కూడా జరగనుంది.


కొండా మురళి వివాదంపై విచారణకు కమిటీ!

ఉమ్మడి వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలపై ఆ పార్టీ నేత కొండా మురళి చేసిన వ్యాఖ్యలతో రేగిన వివాదంపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసే యోచనలో టీపీసీసీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వివాదానికి సంబంధించి ఇటు కొండా దంపతులపై పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు.. సదరు నాయకులపై అటు కొండా అనుచరులు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ క్రమశిక్షణా చర్యల అమలు కమిటీ సమావేశమవుతోంది. ఈ భేటీలో కమిటీ చైర్మన్‌ మల్లు రవి, సభ్యులతో పాటుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ పాల్గొంటారు. సమావేశం తర్వాత కొండా మురళి వివాదంపై విచారణ కమిటీ ఏర్పాటుపై స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.


ఇవి కూడా చదవండి:

ఇరాన్ నుంచి ఢిల్లీ చేరుకున్న 10 మంది ఏపీ విద్యార్థులు

బాబోయ్‌.. జూలై 5న జపాన్‌ వెళ్లం

అంతరిక్షంలోకి పాలకొల్లు అమ్మాయి

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 24 , 2025 | 08:00 AM