Tragedy: ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..
ABN , Publish Date - Jun 26 , 2025 | 12:41 PM
Love Story Tragedy: ఐటీ ఉద్యోగి అనిల్ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమించిన యువతితో ఎంగేజ్‌మెంట్ జరిగింది. నవంబర్‌లో వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఇంతలోనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

Hyderabad: మియాపూర్ ఐటీ ఉద్యోగి (IT Employee) ఆత్మహత్య కేసు (Tragedy Case)లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐటీ ఉద్యోగి అనిల్ అమిత్ చౌడ (Anil Amit Chowda)కు ప్రేమించిన అమ్మాయితో కొద్ది రోజుల క్రితమే ఎంగేజ్‌మెంట్ (Engagement) జరిగింది. నవంబర్‌లో పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో అనిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. మొదట యువతి వేరే కులం కావడంతో అనిల్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తరువాత ఒప్పుకున్నారు. అయితే వివాహం అయిన తర్వాత వేరు కాపురం పెడదామని యువతి చెప్పడంతో అనిల్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రెండు వైపుల ఒత్తిళ్లతో అనిల్ తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
గదిలోకి వెళ్లి చూడగా షాక్..
హైదరాబాద్, హఫీజ్‌పేట్‌లోని లక్ష్మీ ప్రియ నివాసంలో తల్లిదండ్రులతోపాటు అనిల్ అమిత్ చౌడ (30) నివాసముంటున్నాడు. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇటీవల అనిల్‌కు ఓ యువతితో ఎంగేజ్‌మెంట్ జరిగింది. వివాహం నవంబర్‌లో చేయాలని పెద్దలు నిశ్చయించారు. అయితే, ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, మంగళవారం (24వ తేదీ) రాత్రి ఇంట్లో గదిలోకి వెళ్లి అనిల్ తలుపు వేసుకున్నాడు. ఉదయం ఎంతసేపటికి అనిల్ తలుపు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు తలుపు బద్దలు కొట్టారు. తీరా గదిలోకి వెళ్లి చూడగా ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ కుమారుడు అనిల్ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనిల్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. అతడికి ఈ పెళ్లి ఇష్టం లేదా. బలవంతంగా ఎంగేజ్‌మెంట్ చేశారా.. అందుకే ఆత్మహత్య చేసుకున్నాడా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి:
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..
జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు..
For More AP News and Telugu News