Share News

TPCC: గాంధీభవన్‌లో ఇకపై కనిపించని ఫ్లెక్సీలు, బ్యానర్లు

ABN , Publish Date - Feb 27 , 2025 | 07:10 PM

TPCC: తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ రానున్నారు. ఆ పదవిలో నియమితులైన తర్వాత ఆమె తొలిసారిగా హైదరాబాద్ వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

TPCC: గాంధీభవన్‌లో ఇకపై కనిపించని ఫ్లెక్సీలు, బ్యానర్లు
Gandhi Bhavan

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల నూతన బాధ్యురాలుగా మీనాక్షి నటరాజ్‌ను ఆ పార్టీ అధిష్టానం ఇటీవల నియమించింది. ఆమె శుక్రవారం అంటే ఫిబ్రవరి 28వ తేదీన హైదరాబాద్ రానున్నారు. అలాంటి వేళ.. కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఇకపై బ్యానర్లు, కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని ఆ పార్టీ నేతలతోపాటు కేడర్‌ను ఆదేశించింది.

అయితే గాంధీ భవన్ ఆవరణలో పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీతోపాటు రాహుల్ గాంధఈ ఫొటోలు మాత్రమే ఉండాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గాంధీ భవన్ ఆవరణలో ఉన్న ఇతర నేతల ఫొటోలు, కటౌట్లను సిబ్బంది తొలగించారు. ఇక మీనాక్షి నటరాజన్ రాకతో గాంధీ భవన్ రూపు రేఖలు మారనున్నాయనే ఓ చర్చ సైతం ప్రారంభమైంది.

మరోవైపు ఫిబ్రవరి 28వ తేదీన.. అంటే రేపు.. గాంధీ భవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మీనాక్షి నటరాజన్ హాజరుకానున్నారు. అలాగే పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు సీనియర్లు సైతం హాజరు కానున్నారు.

Latest News: వంశీ భార్య కీలక ఆరోపణలు

Also Read: పీసీ ఘోష్ కమిషన్ విచారణలో ఆసక్తికర సంఘటన


తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలిగా ఇటీవల వరకు దీపా దాస్ మున్షి వ్యవహరించారు. అయితే దేశంలోని వివిధ రాష్ట్రాలకు కొత్త వ్యవహారాల బాధ్యులను నియమించారు. ఆ క్రమంలో తెలంగాణకు మీనాక్షి నటరాజన్‌ను నియమించారు. ఆమె నియామకం ఖరారు అయిన తర్వాత... తొలిసారిగా శుక్రవారం హైదరాబాద్ వస్తున్నారు.

Also Read: గిన్నిస్ రికార్డులు సృష్టించిన మహాకుంభ మేళ

Also Read: ప్యూర్ ఈవీ వినియోగదారులకు బంపర్ ఆఫర్


దీంతో ఆమెకు స్వాగతం పలికేందుకు పార్టీలోని నేతలంతా సమాయత్తమవుతోన్నారు. మీనాక్షి నటరాజన్.. హైదరాబాద్ వస్తున్న సందర్భంగా భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేయవద్దని.. అలాగే శాలువాలు, బోకేలు తీసుకు రావద్దంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులను ఆదేశించారు.

For Telangana News And Telugu News

Updated Date - Feb 27 , 2025 | 07:25 PM