Hyderabad Weather: ఏంటీ వాతావరణం.. ఓ వైపు ఎండ.. మరోవైపు వర్షం
ABN , Publish Date - Apr 19 , 2025 | 11:18 AM
Hyderabad Weather: భాగ్యనగరంలో వాతావరణం రోజుకో రకంగా మారుతోంది. ఒకసారి ఎండ ఉంటే.. మరోసారి వర్షం పడుతోంది. ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితి.

హైదరాబాద్, ఏప్రిల్ 19: నగరంలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఓ వైపు భీభత్సమైన ఎండలు ఉక్కిరిబిక్కి చేస్తుంటే అంతలోనే వర్షాలు అల్లకల్లోలం చేస్తున్నాయి. అప్పటి వరకు ఎండగా ఉన్న వాతవారణం ఒక్కసారిగా మారిపోతోంది. ఉన్నట్టుండి వర్షాలు పడుతున్నాయి. ఉదయం నుంచి సూర్యుడు ప్రతాపం చూపిస్తుంటే మధ్యాహ్నం నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాతావరణం మొత్తం ఒక్కసారిగా చట్టబడిపోతోంది. ఉదయం నుంచి ఎండ, వేడిమితో భాగ్యనగర వాసులు అల్లాడిపోతున్న పరిస్తితి. సిటీలో మరోసారి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే వామ్మో ఎండ అనేలా భయపడిపోతున్నారు ప్రజలు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.
ఇక నిన్న సాయంత్రం మాత్రం నగరవ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. కుండపోతగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రాత్రి సమయంలో ప్రజలు ఇబ్బంది పడాల్సి వచ్చింది. రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి చేరడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల కొద్దీ వాహనదారులు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయారు. అలాగే బలమైన ఈదుగాలులు వీచడంతో భారీ వృక్షాలు కూడా నేలరాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, రాజ్‌భవన్ రోడ్, లక్డీకాపూల్, ఉప్పల్, సికింద్రాబాద్, నాంపల్లి, కోటి, ఆబిడ్స్ ఇలా అనేక ప్రాంతాల్లో వర్షం కురిసింది.
Mithun Reddy SIT Inquiry: న్యాయవాదితో సిట్ విచారణకు మిథున్ రెడ్డి
మహారాష్ట్ర నుంచి మన్నార్ గల్ఫ్ వరకు మరాఠ్వాడ, కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి కిలో మీటర్ ఎత్తులో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతోనే హైదరాబాద్‌లో ఏకధాటిగా వర్షం కురిసింది. దాదాపు 8 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు అయ్యింది. అయితే మరో నాలుగు ఐదు రోజు పాటు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం ఎండ తీవ్రత.. సాయంత్రానికి వర్షం కురిసే అవకాశం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెదర్ అలర్ట్ జారీ చేసింది.
ఇవి కూడా చదవండి
తల్లి కోరిక మేరకు 60 ఏళ్లకు పెళ్లి చేసుకున్న బీజేపీ నేత
Kids Cough Syrup Ban: నాలుగేళ్లలోపు పిల్లలకు దగ్గు మందుపై ఆంక్షలు
Read Latest Telangana News And Telugu News