Share News

Harish Rao: బేసిన్‌కు బాసిన్‌కు తేడా తెలియని సీఎం రేవంత్.. హరీష్ ఎద్దేవా

ABN , Publish Date - Jun 27 , 2025 | 02:00 PM

Harish Rao: విషయం లేకనే.. సీఎం రేవంత్ రెడ్డి బూతులు ఎత్తుకున్నారని హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. బేసిన్‌కు బాసిన్‌కు తేడా తెలియని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఒత్తిడితోనే ఎంపీల మీటింగ్ ఏర్పాటు చేశారన్నారు.

Harish Rao: బేసిన్‌కు బాసిన్‌కు తేడా తెలియని సీఎం రేవంత్.. హరీష్ ఎద్దేవా
Former Minister Harish Rao

హైదరాబాద్, జూన్ 27: బనకచర్లపై పీపీటీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కాలయాపన చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో (ABN - Andhrajyothy) మాజీ మంత్రి మాట్లాడుతూ.. డైవర్షన్ కోసమే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారని మండిపడ్డారు. 2016 ఎజెండా మినిట్స్‌పై రేవంత్ రెడ్డితో చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాలు కూర్చుని ప్రణాళికలు సిద్ధం చేసుకుందామని మాత్రమే కేసీఆర్ (Former CM KCR) అన్నారని.. తెలంగాణకు ఆమోదయోగ్యం లేకుంటే ఒప్పుకునేది లేదని 2016 మీటింగ్‌లో ఆయన చెప్పారని గుర్తుచేశారు. బనకచర్లపై కేంద్ర జలశక్తి మీటింగ్‌లో ప్రభుత్వం తెలంగాణ వాదనను గట్టిగా వినిపించాలని డిమాండ్ చేశారు.


విషయం లేకనే.. సీఎం రేవంత్ రెడ్డి బూతులు ఎత్తుకున్నారని వ్యాఖ్యలు చేశారు. బేసిన్‌కు బాసిన్‌కు తేడా తెలియని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఒత్తిడితోనే ఎంపీల మీటింగ్ ఏర్పాటు చేశారన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బనకచర్ల కార్పోరేషన్ ఏర్పడలేదని, టెండర్లు పిలివలేదని చెప్పుకొచ్చారు.చేతులు కాలినాక.. ఆకులు పట్టుకున్న చందంగా బీజేపీ తీరుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు నష్టం జరగకముందే బనకచర్లను ఆపేలా.. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ (Bandi Sanjay) చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బనకచర్లపై రైతులతో కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

SIT Phone Tapping: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు

గోల్కొండలో ఆషాఢ మాస బోనాల సందడి షురూ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 27 , 2025 | 03:18 PM