Bonalu festival: ఘనంగా కొనసాగుతున్న గోల్కొండ బోనాల జాతర
ABN , Publish Date - Jun 29 , 2025 | 11:42 AM
Bonalu festival: గోల్కొండ బోనాల జాతర ఘనంగా కొనసాగుతోంది. రెండో పూజ ఆదివారం కావడంతో గోల్కొండ కోటకు భక్తుల తాకిడి పెరిగింది. దీంతో గోల్కొండ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. గోల్కొండలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.

Hyderabad: తెలంగాణ సంస్కృతికి, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస (Aashada Masam) బోనాల సందడి (Bonala Festival) మొదలైంది. చారిత్రాత్మక గోల్కొండ కోట (Golconda Fort)లో బోనాల సమర్పణ ప్రారంభమయ్యాయి. దీంతో ఆదివారం (Sunday) తెల్లవారుజామునుంచే భక్తులు (Devotees) గోల్కొండకు చేరుకుని ముక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సందర్భంగా గోల్కొండ కోట పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోల్కొండ బోనాల జాతర ఘనంగా కొనసాగుతోంది. రెండో పూజ ఆదివారం కావడంతో గోల్కొండ కోటకు భక్తుల తాకిడి పెరిగింది. దీంతో గోల్కొండ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.
భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు..
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పోతురాజుల విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో గోల్కొండలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఈ నెల 26వ తేదీ గురువారం నుంచి ఆషాడ మాస బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి. గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో బోనాల జాతర మొదలైంది. ప్రతి గురు, ఆదివారాల్లో భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించనున్నారు. అమ్మవార్లకు 9 పూజలతో గోల్కొండ బోనాలు జరుగుతాయి. గోల్కొండ కోటలో నెలరోజుల పాటు బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. గోల్కొండ కోటాలో మొదలైన బోనాలు జులై 24న తిరిగి గోల్కొండ కోటలో వేడుకలు ముగియనున్నాయి.
లష్కర్ బోనాల జాతరకు అంకురార్పణ..
కాగా తెలంగాణ ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్ బోనాల జాతరకు ఆదివారం అంకురార్పణ జరగనుంది. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళీ బోనాల జాతరలో తొలి ఘట్టమైన అమ్మవారి ఘటం ఎదుర్కోలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి గుత్తా మనోహర్ రెడ్డి, ఆలయ ఫ్యామిలీ ట్రస్టు చైర్మన్ సురిటి రామేశ్వర్, కామేశ్వర్లు తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారి ఆభరణాలను అప్పగించడం ద్వారా ఘటం ఎదుర్కోలు ప్రారంభమవుతుందన్నారు. వచ్చే నెల 13వ తేదీన బోనాలు జరుగుతాయని, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, పూజలు చేస్తారని వారు తెలిపారు. 14న ఉదయం 8.30 గంటలకు రంగం (భవిష్యవాణి) కార్యక్రమం జరుగుతుందని వివరించారు.
ఇవి కూడా చదవండి:
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు కీలక భేటీ
గోల్కొండ కోటలో బోనాల సందడి.. భారీగా భక్తులు
For More AP News and Telugu News