Ex CM KCR: వైద్య పరీక్షలు పూర్తి.. ఇంటికి చేరుకున్న మాజీ సీఎం
ABN , Publish Date - Jul 10 , 2025 | 08:10 PM
హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో మాజీ సీఎం కేసీఆర్‌కు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. దీంతో నందినగర్‌లోని తన నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు.

హైదరాబాద్, జులై 10: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి నుంచి ఆయన్ని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అనంతరం హైదరాబాద్‌లో నందినగర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట కుటుంబ సభ్యులు ఉన్నారు.
వైద్యుల సూచనలతో గురువారం ఉదయం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో కేసీఆర్ చేరారు. దీంతో ఆయనకు మరోసారి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అసలు అయితే.. జులై 3వ తేదీన కేసీఆర్ అనారోగ్యంతో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో బ్లడ్ షుగర్, సోడియం స్థాయిలు పరిశీలించేందుకు రెండు రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాలంటూ ఆయనకు వైద్యులు సూచించారు.
దీంతో ఆయన యశోదలో చేరారు. ఆరోగ్యం కుదుటపడడంతో రెండు రోజులకే అంటే.. జులై 5వ తేదీన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్బంగా వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని.. ఆ తర్వాత మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని మాజీ సీఎం కేసీఆర్‌కు వైద్యులు సూచించారు. దాంతో వైద్య పరీక్షల కోసం కేసీఆర్ మళ్లీ ఈ రోజు యశోద ఆసుపత్రికి వెళ్లారు.
మరోవైపు జూన్ 11వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణ కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన అనారోగ్యంతో ఉన్నారు. ఈ కమిషన్ ఎదుట హాజరైన వెంటనే ఆయన ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాత తీవ్ర జ్వరం, జలుబు, గొంతు నొప్పి తదితర సమస్యలతో ఆయన బాధపడుతున్నారు.
ఈ నేపథ్యంలో జులై 3వ తేదీన ఆయన ఎర్రవల్లి నుంచి నేరుగా నందినగర్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆక్కడ ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అయితే మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉందని.. దీంతో ఆసుపత్రిలో చేరాలంటూ ఆయనకు వైద్యులు సూచించారు. దాంతో ఆయన యశోద ఆసుపత్రిలో చేరిన విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి.
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి
Read Latest Telangana News and National News