Share News

Fake Visa Gang: చదువురాని వారే టార్గెట్.. నకిలీ వీసాలతో విదేశాలకు.. చివరకు

ABN , Publish Date - May 15 , 2025 | 03:52 PM

Fake Visa Gang Arrested: నకిలీ వీసాలు తయారు చేస్తున్న ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 14 నకిలీ వీసాలను సీజ్ చేశారు. నకిలీ వీసా ముఠాలతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Fake Visa Gang: చదువురాని వారే టార్గెట్.. నకిలీ వీసాలతో విదేశాలకు.. చివరకు
Fake Visa Gang Arrested

హైదరాబాద్, మే 15: చదవులేని వారిని టార్గెట్‌ చేసుకుని.. వారికి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలుకుతారు. వారి దగ్గర నుంచి లక్షలు వసూలు చేస్తారు. నకిలీ వీసాలు సృష్టించి విదేశాలకు పంపేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే వీరి ఆగడాలకు చెక్ పెట్టారు పోలీసులు. శంషాబాద్‌‌లో (Shamshabad) నకిలీ వీసాల ముఠాను ఎయిర్‌పోర్టు, ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. చదువులేని వారిని విదేశాలకు పంపుతున్న గ్యాంగ్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ వీసాలతో ఇద్దరు కార్మికులు విదేశాలకు వెళ్లేందుకు సిద్ధం కావడంతో పోలీసులు పక్కా సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.


అలాగే నకిలీ వీసాలు తయారు చేస్తున్న ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 14 నకిలీ వీసాలను సీజ్ చేశారు. నకిలీ వీసా ముఠాలతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గతంలో కూడా వీళ్లు చాలా మందిని తెలంగాణ నుంచి నకిలీ వీసాలతో విదేశాలకు పంపేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఒక్కొక్కరి వద్ద నుంచి లక్షలు వసూలు చేసి వాళ్లను విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నకిలీ వీసాలతో దేశం దాటించాలని ప్రయత్నం చేశారు. దీనిపై ఎయిర్‌పోర్టు పోలీసులకు, ఎస్వీటీ పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఎవరెవరిని ఈ విధంగా పంపించారనే అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

RTC Staff Scandal: కాసుల కోసం దిగజారిన ఆర్టీసీ సిబ్బంది.. విషయం ఇదీ


తెలంగాణలో చాలా మంది చదువురాని వాళ్లను విదేశాల్లో ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడుతున్న సంఘటనలు వరుసగా వెలుగు చూస్తుండటంతో పోలీసులు వీరిపై నిఘా పెట్టారు. ఎట్టకేలకు నకిలీ వీసాలు తయారు చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారిద్దరినీ కూడా కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరికొన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు.. కారణమిదే

Saraswati Pushkaralu: సరస్వతి పుష్కరాలు ప్రారంభం.. భారీగా తరలివస్తున్న భక్తులు


Read Latest
Telangana News And Telugu News

Updated Date - May 15 , 2025 | 03:52 PM