OG Kush: కలకలం రేపుతున్న డ్రగ్స్.. ఈసారి పట్టుపడింది ఎవరంటే..
ABN , Publish Date - Apr 16 , 2025 | 06:25 PM
హైదరాబాద్‍లో డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రతీక్ బట్‌తోపాటు చంద్రపాలక జయసూర్య అనే మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు. నిందితుడు ప్రతీక్ బట్ ఓ సంస్థలో సూపర్ వైజర్‌గా పని చేస్తూ మత్తుపదార్థాలు అమ్ముతున్నట్లు కమిషనర్ వెల్లడించారు.

హైదరాబాద్: భాగ్యనగరాన్ని డ్రగ్స్ మహమ్మారి వదిలిపెట్టడం లేదు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా డ్రగ్స్ సరఫరా దారులు వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల మత్తుపదార్థాలు సరఫరా చేస్తూ నమోదవుతున్న కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా మరోసారి డ్రగ్స్ పట్టుపడడం తీవ్ర కలకలం సృష్టించింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.40 లక్షల విలువైన అరకేజీ ఓజి కుష్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి వెల్లడించారు.
హైదరాబాద్‍లో డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రతీక్ బట్‌తోపాటు చంద్రపాలక జయసూర్య అనే మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు. నిందితుడు ప్రతీక్ బట్ ఓ సంస్థలో సూపర్ వైజర్‌గా పని చేస్తూ మత్తుపదార్థాలు అమ్ముతున్నట్లు కమిషనర్ వెల్లడించారు. గ్రాము ఓజి కుష్ డ్రగ్‌ను రూ.3వేలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఇవాళ (బుధవారం) మధ్యాహ్నం జయసూర్యకు ప్రతీక్ డ్రగ్స్ అమ్ముతుండగా పట్టుకున్నట్లు చెప్పారు. ప్రతీక్ నుంచి 500 గ్రాముల ఓజి కుష్ స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ రూ.40 లక్షలు ఉంటుందని వెల్లడించారు. పక్కా సమాచారం మేరకు వారిద్దరినీ అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుల నుంచి ఆరు గ్రాముల చరసి, ఆరు విదేశం మద్యం బాటిళ్లు, స్కోడా కారు, ఎలక్ట్రికల్ వేయింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ ఖురేషి వెల్లడించారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు సైతం ప్రతీక్ బట్ మత్తుపదార్థాలు విక్రయిస్తున్నట్టు కమిషనర్ ఖురేషి తెలిపారు. ఓజి కుష్ అనేది గంజాయి కంటే 25 శాతం ఎక్కువ మత్తు ఇస్తుందని పేర్కొన్నారు. ఇది విదేశాల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారని, గంజాయి లాగా దీన్ని పండించడానికి భూమి అవసరం లేదని చెప్పారు. భారతదేశంలో హిమాలయ పర్వతాల్లో ఓజి ఖుష్ పండించేందుకు అనుకూల వాతావరణం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ డ్రగ్ నీళ్లలోనే ఎక్కువగా పండుతుందని వెల్లడించారు. పట్టుకున్న ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
IAS Smita Sabharwal: ఐఏఎస్ స్మితా సబర్వాల్‍కు నోటీసులు.. విషయం ఏంటంటే..
Poisoning In School: విద్యార్థులపై విష ప్రయోగం.. సంచలనం రేపుతున్న ఘటన..
Chandanotsavam 2025: సింహాచలానికి సీఎం చంద్రబాబు వచ్చేది ఆ రోజే: మంత్రి ఆనం..