Share News

TG News: హాస్టల్‌లో ఒంటిరిగా ఉన్న బీటెక్‌ విద్యార్థినిపై..

ABN , Publish Date - Jan 16 , 2025 | 04:12 PM

Telangana: ఇంజనీరింగ్ విద్యార్థినిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. హాస్టల్‌లో దూరి గదిలో ఒంటరిగా ఉన్న బీటెక్ విద్యార్థిపై అత్యాచారానికి పాల్పడ్డాడు డ్రైవర్. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విద్యార్థినిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

TG News: హాస్టల్‌లో ఒంటిరిగా ఉన్న బీటెక్‌ విద్యార్థినిపై..
Ibrahimpatnam

హైదరాబాద్, జనవరి 16: అబలలపై రోజు రోజుకు అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్నో విధాలుగా రక్షణ కల్పిస్తున్పటికీ ఏదో ఒక చోట యువతులు అత్యాచారాల బారిన పడుతూనే ఉన్నారు. ఆడపిల్లలను ఇంటి నుంచి బయటకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో (Hyderabad) మరో యువతి.. కామాంధుడికి ఆఘడాలకు బలైపోయింది. ఉజ్వల భవిష్యత కోసం ఇంటిని వదిలి, తల్లిదండ్రులను వదలి దూరంగా ఉంటూ చదువుతున్న బీటెక్ చదువుతున్న విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో కామాంధుడు. నగరంలోని ఇబ్రహీంపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది..


ఇంజనీరింగ్ విద్యార్థినిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. హాస్టల్‌లో దూరి గదిలో ఒంటరిగా ఉన్న బీటెక్ విద్యార్థిపై అత్యాచారానికి పాల్పడ్డాడు డ్రైవర్. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విద్యార్థినిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఇబ్రహీంపట్నం అత్యాచార ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు తెలియజేశారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అత్యాచారం కేసు నమోదైందన్నారు. మధ్యాహ్నం12:38 నిమిషాలకు డయల్ హండ్రెడ్ ద్వారా సమాచారం అందిందన్నారు.

Saif Ali Khan: సైఫ్ నివాసంలోకి దొంగ ఎలా ప్రవేశించాడంటే..?


బాధితురాలు మంగల్‌పల్లిలోని ఓ హాస్టల్లో ఉంటూ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోందని. సెమిస్టర్ ఉండటంతో హాస్టల్లో ఉంటూ ప్రిపేర్ అవుతోందని తెలిపారు. రాత్రి 11 గంటల సమయంలో బాధిత బాలిక గదిలో ఒంటరిగా ఉందని.. అదే సమయంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న అజిత్ ఆమె గదిలోకి చొరబడ్డాడని తెలిపారు. బలవంతంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని... అనంతరం అతడు అక్కడి నుంచి పరారైనట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని... నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - Jan 16 , 2025 | 04:12 PM