Eco Friendly Park: ఏకో ఫ్రండ్లీ పార్కు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి
ABN , Publish Date - Jan 28 , 2025 | 01:27 PM
150 కోట్లు ఖర్చుతో ఏర్పాటు చేసిన ఏకో ఫ్రండ్లీ పార్కును సీఎం రేవంత్ రెడ్డి, ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. ఈ పార్కులో 1,500 మంది కూర్చునేలా ఇండియాలోనే అతిపెద్ద హంపీ థియేటర్‌ను ఏర్పాటు చేశారు. 30 అడుగుల ఎత్తులో 20 స్టెయిన్ లెస్ స్టీల్ శిల్పాలు ఏర్పాటు చేసి వాటిని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

రంగారెడ్డి జిల్లా: శంకర్ పల్లి మండలం (Shankarpalli Mandalam), ప్రొద్దుటూరులో ప్రపంచంలోనే అతిపెద్ద ఏకో ఫ్రండ్లీ పార్కు (Eco Friendly Park)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మంగళవారం ప్రారంభించారు (Inauguration). ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao), పలువురు నేతలు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ప్రకృతి ప్రేమికుల కోసం నగర శివార్లలో నిర్మించిన అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ ‘ఎక్స్ పీరియం’ పార్క్‌ను ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయిలో రామ్‌దేవ్‌రావు 150 ఎకరాలలో ఏర్పాటు చేసిన పార్కులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 25 వేల జాతులకు సంబంధించిన మొక్కలు ఉన్నాయి. అర్జెంటీనా, ఉరుగ్వే, మెక్సికో, సౌత్ అమెరికా, స్పెయిన్, ఇటలీ, న్యూగినియా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాల నుంచి అరుదైన మొక్కలు, చెట్లు, రకరకాల స్టోన్స్, అందమైన శిలలు సేకరించి గార్డెన్‌ను ఏర్పాటు చేశారు.
ఈ వార్త కూడా చదవండి..
మీర్‌పేట్ కేసులో వెలుగులోకి కొత్త ట్విస్ట్
దీని కోసం సుమారు రూ. 150 కోట్లు ఖర్చు చేశారు. ఒక్కో శిల్పానికి రూ. 5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేశారు. 1,500 మంది కూర్చునేలా ఇండియాలోనే అతిపెద్ద హంపీ థియేటర్‌ను ఏర్పాటు చేశారు. 30 అడుగుల ఎత్తులో 20 స్టెయిన్ లెస్ స్టీల్ శిల్పాలు ఏర్పాటు చేసి వాటిని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. రూ. 50 కోట్లతో 12 ఎకరాలలో మ్యాన్‌మేడ్ బీచ్ ఏర్పాటు చేశారు. 40 గదులు, 20 కాటేజీలతో సుందరమైన సహజ రిసార్టు ద్వీపంగా తీర్చిదిద్దారు. పీవెడ్డింగ్, పోస్టు వెడ్డింగ్, ఫొటో షూట్‌లకు ఎక్స్‌పీరియంను రామ్‌దేవ్‌రావు ఎంతో శ్రమకోర్చి ఏర్పాటు చేశారు. దేశానికి గర్వకారణంగా, రాష్ట్ర ప్రతిష్టకు చిహ్నంగా, హైదరాబాద్‌కు ఐకానిక్‌గా ఎక్స్‌పీరియం ఉంటుందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సుప్రీం కోర్టు డెడ్‌లైన్‌తో కొల్లేరులో మళ్లీ టెన్షన్...
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
కు.ని. ఆపరేషన్.. డాక్టర్ల నిర్లక్ష్యం.. మహిళ మృతి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News