Home » Chiranjeevi
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సులో రెండో రోజు కూడా పెట్టుబడులు వెల్లువెత్తాయి! దేశ, విదేశ కంపెనీలు క్యూ కట్టాయి రెండు రోజుల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంలో.......
ఫ్యూచర్ సిటీలో రెండో రోజు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఇదో గొప్ప సమ్మిట్ అని కొనియాడిన చిరు.. ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా సహకరిస్తామని ఈ సందర్భంగా అన్నారు.
పెరుగుతున్న టెక్నాలజీ ని ఆహ్వానించాలని... కానీ దాని వల్ల ముప్పు కూడా ఉందని చిరంజీవి అన్నారు. ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ప్రముఖ నటుడు కొణిదెల చిరంజీవి వ్యక్తిత్వ హక్కులకు మధ్యంతర ఉత్తర్వులని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు శనివారం మంజూరు చేసింది. చిరంజీవి అనుమతి లేకుండా.. పలువురు ఆయన పేరుని వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడాన్ని న్యాయస్థానం నిషేధించింది.
మెగాస్టార్ చిరంజీవి తెలుగు తేజం, యంగ్ క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించారు. 'మన శంకర్ వరప్రసాద్ గారు'సెట్ కు వచ్చిన తిలక్ వర్మ ను ఆత్మీయంగా శాలువాతో సత్కరించారు.
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా టికెట్ ధరలు పెంచడం వల్ల సగటు చిన్న నిర్మాతలు నష్టపోతున్నారని తెలుగు సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుడికి కూడా వినోదాన్ని పంచేది కేవలం సినిమా మాత్రమేనని తెలిపారు. అలాంటి సినిమా టికెట్ ధరలు పెంచితే సామాన్యుడు ఇబ్బంది పడతారని నారాయణ మూర్తి పేర్కొన్నారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైరయ్యారు. చిరంజీవి గట్టిగా ఆడిగాక జగన్ సినీ ప్రముఖులను కలిశారన్న కామినేని వ్యాఖ్యలతోనూ బాలయ్య ఏకీభవించలేదు. ఆ సైకోని కలిసేందుకు తనకూ ఆహ్వానం వచ్చినా వెళ్లలేదన్న విషయాన్ని..
ఏపీ అసెంబ్లీలో చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. దీనిపై చిరంజీవి స్పందించారు. బాలయ్య వ్యాఖ్యలపై తన వంతు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ఆయన ఒక సుధీర్ఘ..
అవయవదానం చేసేవారు దేవుళ్లతో సమానం అని సినీ నటుడు చిరంజీవి అన్నారు. దేవుడు ఎక్కడో లేడని.. మంచి మనసులో, దానగుణంలో ఉంటాడని..
ఫిల్మ్ ఫెడరేషన్ సమ్మె కారణంగా గత కొద్ది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పలు సినిమాల షూటింగ్‌లు ఆగిపోయాయి. పలు సార్లు తెలుగు సినిమా నిర్మాతలు, కార్మికుల మధ్య చర్చలు జరిగినా అవి సఫలం కాలేదు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగుతున్నట్టు వార్తలు వచ్చాయి.