Hyderabad Drug Bust: హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
ABN , Publish Date - Nov 06 , 2025 | 09:32 AM
రాజేంద్రనగర్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించారు.
హైదరాబాద్, నవంబర్ 6: తెలంగాణను డ్రగ్స్ రహితంగా రాష్ట్రంగా మార్చేందుకు పోలీసులు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎక్కడో చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉంది. ఇటీవల కాలంలో హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో తరుచుగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది. డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఇటీవల రహస్యంగా డ్రగ్స్ పార్టీలు చేసుకుంటున్నట్టు పక్కా సమాచారం అందడంతో ఎస్‌వోటీ పోలీసులు మెరుపు దాడులు చేసి అనేక మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ తీసుకుంటున్న వారితో పాటు డ్రగ్స్ విక్రేతలను కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా మరోసారి డ్రగ్స్ ముఠా గుట్టును ఎస్‌వోటీ పోలీసులు రట్టు చేశారు.
రాజేంద్రనగర్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించారు. నైజీరియా నుంచి డెడ్ డ్రాప్ పద్ధతిలో యువకులు డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పక్కా సమాచారంతో.. బెంగళూరు నుంచి బస్సులో డ్రగ్స్ తీసుకొని హైదరాబాద్ వస్తున్న నలుగురు యువకులను ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్ సప్లైయర్ సంగడి సంతోష్‌తో పాటు గాంధీ సందీప్ కండేపల్లి, శివ పలక, సాయిబాబులను అరెస్ట్ చేశారు. నలుగురు నుంచి పెద్ద మొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్‌ను ఎస్‌ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తీసుకున్నా, సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
ఎక్సైజ్ శాఖకు.. ఒక్క నెలలోనే భారీగా ఆదాయం..
బీహార్ అసెంబ్లీ మొదటి దశ పోలింగ్ ప్రారంభం
Read Latest Telangana News And Telugu News