Share News

CV Ananad: గోషా మహల్‌లో హైదరాబాద్ సీపీ..

ABN , Publish Date - Jun 03 , 2025 | 01:35 PM

CV Ananad: ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం పనులు త్వరలో జరుగుతున్న నేపథ్యంలో తమ పోలీస్ శాఖకు చెందిన బ్లాక్స్‌ను తరలిస్తున్నామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. చాలా సంవత్సరాలుగా ఉన్న హార్స్ గ్రౌండ్‌ను తాత్కాలికంగా తరలించినట్లు చెప్పారు.

CV Ananad: గోషా మహల్‌లో హైదరాబాద్ సీపీ..
CP CV Ananad

హైదరాబాద్, జూన్ 3: గోషామహల్ పోలీస్ గ్రౌండ్‌ను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CP CV Anand) ఈరోజు (మంగళవారం) సందర్శించారు. గోషామహల్ పోలీస్ గ్రౌండ్‌లో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తున్న సందర్భంగా హార్స్ గ్రౌండ్‌ను అక్కడి నుంచి చక్నావాడి దగ్గరలో షెడ్డును నిర్మించారు. ఈ క్రమంలో నూతనంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక హార్స్ గ్రౌండ్ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మహిళా పోలీసులకు సెల్ఫ్ డిఫెన్స్‌పై ట్రైనింగ్‌ను పరిశీలించారు సీపీ. ట్రైనింగ్‌లో నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ కిట్స్‌ను ట్రైనీ మహిళా పోలీసులు ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఆపై సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ఉస్మానియా నూతన భవనం నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.


ఆసుపత్రి నిర్మాణం పనులు త్వరలో జరుగుతున్న నేపథ్యంలో తమ పోలీస్ శాఖకు చెందిన బ్లాక్స్‌ను తరలిస్తున్నామని తెలిపారు. చాలా సంవత్సరాలుగా ఉన్న హార్స్ గ్రౌండ్‌ను తాత్కాలికంగా తరలించినట్లు తెలిపారు. నేటితో తమ శాఖకు చెందిన అన్ని విభాగాలను తరలించి వైద్య శాఖకు అప్పగించామన్నారు. పోలీస్ శాఖకు ఇక్కడే 11 ఎకరాలు కేటాయించారని అన్నారు. 11 ఎకరాల్లో తమ 7 జోన్లకు చెందిన పలు కాంప్లెక్స్‌లను నిర్మిస్తామని చెప్పారు. టీటీఐ ప్రక్కన మరో 2 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.55 కోట్లు కేటాయించారన్నారు.


పోలీస్ కార్పొరేషన్ ద్వారా నిర్మాణాలు జరుగుతాయన్నారు. తాత్కాలికంగా హార్స్ టేబుల్, డాగ్ కెనల్‌ను నిర్మించినట్లు వెల్లడించారు. ఒక ఏడాదిలో తమ పోలీస్‌కు సంబంధించిన భవనాల పనులను పూర్తి చేస్తామన్నారు. స్వీప్ట్ ఉమెన్ యాక్షన్ టీం తయారు చేశామన్నారు. మహిళలను ప్రొటెక్ట్ చేసినప్పుడు వారిని సురక్షితంగా తరలించడానికి ఈ టీమ్ పనిచేస్తుందని.. ఇదీ ఈ టీమ్ ప్రత్యేకత అని తెలిపారు. మొదటి టీం 35 మందితో స్వీప్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్ సిద్ధం చేశామని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

బీఆర్ఎస్‌కు షాక్.. మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

టీ.బీజేపీలో రాజాసింగ్ కల్లోలం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 03 , 2025 | 05:39 PM