Share News

CM Revanth with Collector: సీఎం, కలెక్టర్ల మధ్య ఆసక్తికర సంభాషణ.. ఏమైందంటే.?

ABN , Publish Date - Nov 20 , 2025 | 06:11 PM

సీఎం రేవంత్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ గరీమా అగర్వాల్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ వారివురి మధ్య జరిగిన ఆ సంభాషణ ఏంటి? వైరల్ అయ్యేంతగా అందులో ఏముందంటే.?

CM Revanth with Collector: సీఎం, కలెక్టర్ల మధ్య ఆసక్తికర సంభాషణ.. ఏమైందంటే.?
CM Revanth Reddy

హైదరాబాద్, ఆంధ్రజ్యోతి: తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 19న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి(TG CM Revanth Reddy). ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్‌(Rajanna Siricilla District Collector Garima Agarwal)తో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ వీడియో మీటింగ్‌లో కలెక్టర్.. తాను మాట్లాడదలచుకున్న అంశాన్ని ఇంగ్లీష్‌లో చెప్పబోయారు. ఇంతలో సీఎం కలుగజేసుకుంటూ.. 'కలెక్టర్ గారూ.. తెలుగులో మాట్లాడండి. తెలుగు వచ్చు కదా?' అని నవ్వుతూ తెలుగు భాషపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. దీనికి కలెక్టర్ నవ్వుతూనే స్పందిస్తూ.. 'వస్తది సర్' అని సమాధానమిచ్చారు. ఆ తర్వాత వీరి సంభాషణ కొనసాగింది.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కలెక్టర్ గరీమా అగర్వాల్‌ల మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.


ఇవీ చదవండి:

రాష్ట్రపతి ముర్ము పర్యటన.. హైదరాబాద్‌‌లో ట్రాఫిక్ ఆంక్షలు

ఆరేళ్ల తరువాత కోర్టుకు జగన్.. మూడు నిమిషాల్లోనే

Updated Date - Nov 20 , 2025 | 06:26 PM