Operation Kagar: రేవంత్‌రెడ్డి, కేసీఆర్ రంగంలోకి దిగడంతో ఆపరేషన్ కగార్‌కు బ్రేక్ పడనుందా..
ABN , Publish Date - Apr 28 , 2025 | 08:29 AM
Operation Kagar: తెలంగాణ ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో గత కొన్నేళ్లుగా మావోయిస్టులపై ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌తో వందలాది మావోయిస్టులు చనిపోతున్నారు. మావోలు మృతిచెందుతుండటంపై పౌర హక్కుల సంఘాల నేతలు కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో చర్యలు తీసుకుంటుంది. ఈ ఆపరేషన్ వల్ల వందలాది మంది మావోలు మృతిచెందుతున్నారు. మావోలు చనిపోతుండటంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కేంద్ర చర్యలను ఖండించారు. మరోవైపు మావోయిస్టులతో చర్చలు జరపకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా చర్యలు తీసుకుంటుందని పౌర హక్కుల సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్రెగుట్టల్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి ఆపరేషన్ కొనసాగిస్తుండటంతో పౌర హక్కుల సంఘాలు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేస్తున్నాయి.
అలాగే సీఎం రేవంత్‌రెడ్డి, కేసీఆర్ రంగంలోకి దిగడంతో ఆపరేషన్ కగార్‌కు బ్రేక్ పడుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నిన్న(ఆదివారం) వరంగల్‌లోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఆపరేషన్ కగార్ నిలిపి వేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మావోయిస్ట్‌లతో కేంద్రం చర్చలు జరపాలని సభలో తీర్మానం పెడుతున్నామని చప్పట్లతో ఆమోదం తెలపాలని కేసీఆర్ కోరారు. చప్పట్లు కొట్టించి ప్రజల ఆమోదమే తీర్మానంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపుతామని కేసీఆర్ అన్నారు. బలం ఉందని చంపుకుంటూ వెళ్లడం ధర్మం కాదని మావోయిస్ట్‌లతో చర్చలు జరపాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. సామాజిక కోణంలోనే నక్సలిజాన్ని చూస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
శాంతి చర్చల కమిటీ భేటీలో నక్సలిజాన్ని శాంతి భద్రతల అంశంగా పరిగణించమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయడానికి మంత్రులతో చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రేవంత్, కేసీఆర్ సానుకూలంగా స్పందించడంతో పౌర హక్కుల సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ కగార్ నిలిపి వేయాలంటే రాజకీయ పార్టీల జోక్యంతోనే సాధ్యమని పౌర హక్కుల సంఘాల నేతలు నమ్ముతున్నారు. రేవంత్‌రెడ్డి, కేసీఆర్ చొరవతో కాల్పులు నిలిపివేసి కేంద్ర ప్రభుత్వం మావోయిస్ట్‌లతో చర్చలు జరిపితే చరిత్రలో నిలుస్తారని పౌర హక్కుల సంఘాల నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి, కేసీఆర్ ప్రకటనలతో పౌర హక్కుల సంఘాల నేతల నిరసనలు ఊపందుకోనున్నాయి. కేంద్రంపై ఒత్తిడి పెంచేలా పౌర హక్కుల సంఘాలు మేధావులు, కమ్యూనిస్టు పార్టీలు, విద్యార్థి సంఘాలు కథం తొక్కనున్నారు.
ఈ వార్తలు కూాడా చదవండి...
CM Revanth Reddy: ప్రపంచానికి దిక్సూచి తెలంగాణ
Mahesh Babu: విచారణకు రాలేను.. మరో తేదీ ఇవ్వండి
Kaleshwaram: బినామీల గుట్టు విప్పని హరిరామ్!
Read Latest Telangana News And Telugu News