Share News

Fire Accident: గచ్చిబౌలిలో కారులో మంటలు

ABN , Publish Date - Jun 03 , 2025 | 12:27 PM

Fire Accident: గచ్చిబౌలిలో అగ్ని ప్రమాదం జరిగింది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్దమైంది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. కారు ఇంజన్ నుంచి మంటలు రావడం గమనించిన ప్యాసింజర్లు వెంటనే అప్రమత్తమై కారు నుంచి దిగిపోయారు.

Fire Accident: గచ్చిబౌలిలో కారులో మంటలు
Fire Accident

Hyderabad: గచ్చిబౌలి (Gachibowli)లో కారులో ఒక్కసారిగా మంటలు (Car fire) చెలరేగాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం (Cyberabad police office) ఎదుగా ఈ ఘటన జరిగింది. కారు రన్నింగ్‌లో ఉండగానే మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు (Police), అగ్నిమాపక సిబ్బంది (Firefighters) మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ క్రమంలో గచ్చిబౌలి వేళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ (Traffic Jam) ఏర్పడింది.


కారు పూర్తిగా దగ్ధం..

అగ్ని ప్రమాదంలో కారు పూర్తిగా దగ్దమైంది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. కారు ఇంజన్ నుంచి మంటలు రావడం గమనించిన ప్యాసింజర్లు వెంటనే అప్రమత్తమై కారు నుంచి దిగిపోయారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే మంటలు కారు మొత్తం వ్యాపించాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి వచ్చేలోపే కారు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


కాగా ఈ నెల 17న గచ్చిబౌలి.. ఐటీ కారిడార్‌లో రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి. సైబర్ టవర్ నుంచి బయోడైవర్సిటీ వైపు వెళ్తున్న కారు.. మైండ్ స్పేస్ సమీపంలోకి రాగానే ఇంజన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును పక్కకు ఆపి బయటకు పరుగులు తీశాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో కారు సగం వరకు కాలిపోయింది. ఈ క్రమంలో సైబర్ టవర్ నుంచి మైండ్ స్పేస్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదానికి గురైన కారును పోలీసులు పక్కకు జరిపించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

2కె రన్‌లో పాల్గొన్న ‘భైరవం’ చిత్రం యూనిట్

తుని రైలు దహనం కేసు.. అప్పీల్‌కు ఏపీ

For More AP News and Telugu News

Updated Date - Jun 03 , 2025 | 12:27 PM