KTR Targets BJP: బీజేపీని టార్గెట్ చేసిన కేటీఆర్.. వీడియోలతో సెటైర్లు
ABN , Publish Date - May 26 , 2025 | 03:55 PM
బీజేపీని ఎందుకు విమర్శించటం లేదని పార్టీ మహిళా నేత.. మరో పక్క సొంత చెల్లెలైన కల్వకుంట్ల కవిత లేఖాస్త్రం ఎఫెక్టో.. మరొకటో కాని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ బీజేపీని టార్గెట్ చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: బీజేపీని ఎందుకు విమర్శించటం లేదని పార్టీ మహిళా నేత.. మరో పక్క సొంత చెల్లెలైన కల్వకుంట్ల కవిత లేఖాస్త్రం ఎఫెక్టో.. మరొకటో కాని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ బీజేపీని టార్గెట్ చేశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్, ఢిల్లీ విమానాశ్రయం వీడియోలు పెట్టి సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు. హైదరాబాద్‌లో రూ.430 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన చర్లపల్లి రైల్వే స్టేషన్ అయినా, లేదా ఢిల్లీ విమానాశ్రయం పైకప్పులైనా, బిజెపి మార్క్ 'అభివృద్ధి'ని చాటిచెప్పటానికి ఒక సాధారణ వర్షం సరిపోతుంది. అంటూ ఎద్దేవా చేశారు.
గతేడాది ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఊడిపోయిన పైకప్పు ఇదే కాదా? అంటూ అప్పటి వీడియో పోస్ట్ చేసిన కేటీఆర్.. చర్లపల్లి రైల్వే స్టేషన్లో పై కప్పు రేకులు ఊడిపడుతున్న వీడియో కూడా జతచేసి కామెంట్ చేశారు. వీటన్నింటినీ కూల్చివేసేందుకు ఒకే ఒక వర్షం పట్టిందన్నారు. వాళ్లు సరిగ్గా పైకప్పును కూడా నిర్మించలేకపోవడం విచారకరం. కానీ.. కాళేశ్వరం గురించి కామెంట్లు చేయాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బిజెపి ప్రవేశపెట్టిన షేప్‌షిఫ్టర్ పైకప్పుల అద్భుతమైన కొత్త మోడల్‌ను ఏ ఏజెన్సీ నిర్వహిస్తోందనని నేను ఆశ్చర్యపోతున్నాను?! అంటూ కామెంట్ చేశారు కేటీఆర్. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దారుణం.. తొమ్మిది మంది అన్నాచెల్లెళ్లు మృతి..
భూమిక మృతదేహం అప్పగింతకు నిరాకరణ
For International news And Telugu News