Telangana BC Reservation: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకు తెలంగాణ సర్కార్
ABN , Publish Date - Oct 14 , 2025 | 10:22 AM
ప్రధాన న్యాయమూర్తి అనుమతితో లిస్ట్ చేయనున్నట్లు రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌పై గురువారం లేదా శుక్రవారం సుప్రీం ధర్మాసం ముందు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 14: సుప్రీం కోర్టులో(Supreme Court) తెలంగాణ బీసీ రిజర్వేషన్ల (Telangana BC Reservation) ప్రస్తావన వచ్చింది. 42 శాతం రిజర్వేషన్ల పిటిషన్‌పై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం మెన్షన్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు.. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ దగ్గర మెన్షన్ చేశారు. గురువారం (ఈనెల 16) లేదా శుక్రవారం (ఈనెల 17) విచారణకు తీసుకోవాలని న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ప్రధాన న్యాయమూర్తి అనుమతితో లిస్ట్ చేయనున్నట్లు రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌పై గురువారం లేదా శుక్రవారం సుప్రీం ధర్మాసనం ముందు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
కాగా.. బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన జీవో 9పై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది. బీసీలకు 42 శాతం జీవోపై హైకోర్టు ఇచ్చిన స్టేను తొలగించాలని పిటిషన్‌లో పేర్కొంది. విచారణ త్వరగా స్వీకరించాలని.. ఈ వారంలోనే విచారణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైందని, అంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారని.. ఈ క్రమంలో రిజర్వేషన్లపై తేల్చాలని.. జీవో నెంబర్ 9పై తెలంగాణ హైకోర్టు విధించిన స్టేను తొలగించాలని పిటిషన్‌లో వెల్లడించింది. ఈ రిజిర్వేషన్లపై హైకోర్టు తమ వాదనలను సంపూర్ణంగా వినకుండానే స్టే విధించిందని, బీసీ సమగ్ర వివరాలు కులగణన ద్వారా సేకరించామని, కమిషన్ అధ్యయనం తర్వాత రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించామని తెలిపింది సర్కార్. తెలంగాణలో 56 శాతంపైగా బీసీలు ఉన్నారని, జనాభా నిష్పత్తి ప్రకారం 42 శాతం రిజర్వేషన్ కేటాయించామని ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
జూబ్లీహిల్స్‌లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతాం..
హంగు, ఆర్భాటం లేకుండా నామినేషన్ వేయనున్న సునీత
Read Latest Telangana News And Telugu News