Share News

Kidney Racket Case: సంచలన విషయాలు బయటపెట్టిన రాచకొండ సీపీ

ABN , Publish Date - Jan 25 , 2025 | 01:48 PM

Kidney Racket Case: అలకానంద హాస్పటల్ ఇల్లీగల్ కిడ్నీ ట్రాన్స్ ఫ్లాంటేషన్ జరుగుతుందని సమాచారంతో దర్యాప్తు జరిపామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. తమిళనాడుకు చెందిన నసింభాను, ఫిర్ధోస్ కిడ్నీ డోనర్స్ అని, అలాగే బెంగళూరుకు రాజశేకర్, ఫ్రభ కిడ్నీ రిసీవర్స్‌గా గుర్తించామన్నారు. ఇప్పటి వరకు మొత్తం 20 ఆపరేషన్స్ ఆస్పత్రిలో చేశారన్నారు.

Kidney Racket Case: సంచలన విషయాలు బయటపెట్టిన రాచకొండ సీపీ
Alakananda Kidney Racket Case

హైదరాబాద్, జనవరి 25: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అలకనంద కిడ్నీ రాకెట్‌ కేసులో (Alakananda Kidney Racket Case) పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో మొత్తం 15 మందిని నిందితులుగా గుర్తించిన రాచకొండ పోలీసులు.. వారిలో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఆరుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ కేసులో అవినాష్ అనే వ్యక్తి కింగ్ పిన్‌గా ఉన్నాడు. హాస్పిటల్ యజమాని సుమంత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు నిన్న (శుక్రవారం) అతడిని రిమాండ్ చేశారు. అలాగే రిసెప్షనిస్ట్ గోపి‌ని రిమాండ్‌కు తరలించారు. డాక్టర్ అవినాష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు డాక్టర్స్ రాజశేఖర్, షోహిబ్, తమిళనాడు, జమ్మూ కాశ్వీర్‌కు చెందిన డాక్టర్స్ పరారీలో ఉన్నారు. నిర్వాహకులు ప్రదీప్, సూరజ్, నల్లగొండ జిల్లాకు చెందిన మెడికల్ అసిస్టెంట్లు రవి, రవింధర్, హరీష్ , సాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. సర్జికల్ మెటీరియల్ కిట్‌తోపాటు 10 మొబైల్స్, 5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.


ఈ సందర్భంగా రాచకొండ సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ.. అలకానంద హాస్పటల్ ఇల్లీగల్ కిడ్నీ ట్రాన్స్ ఫ్లాంటేషన్ జరుగుతుందని సమాచారంతో దర్యాప్తు జరిపామని తెలిపారు. తమిళనాడుకు చెందిన నసింభాను, ఫిర్ధోస్ కిడ్నీ డోనర్స్ అని, అలాగే బెంగళూరుకు రాజశేకర్, ఫ్రభ కిడ్నీ రిసీవర్స్‌గా గుర్తించామన్నారు. ఇప్పటి వరకు మొత్తం 20 ఆపరేషన్స్ ఆస్పత్రిలో చేశారన్నారు. అవినాష్ చైనాలో ఎంబీబీఎస్ చేశాడని.. సుమంత్ ఉజకిత్సాన్‌లో ఎంబీబీఎస్ చేసినట్లు తెలిపారు. 2022 నుంచి హైదరాబాద్‌లో జననీ హాస్పిటల్ నిర్వహించారని.. గత ఆరు నెలలుగా అలకానంద హాస్పటల్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు నలుగురు నిందితులను ప్రశ్నించామని.. ఆస్పత్రి సిబ్బంది, వైద్యుల గురించి ఆరా తీశామన్నారు. కిడ్నీ రాకెట్‌లో పవన్ అనే వ్యక్తి మధ్యవర్తిగా ఉన్నాడన్నారు. ఒక్కో ఆపరేషన్‌కు రూ.50లక్షల నుంచి రూ.60 లక్షలు వసూలు చేసినట్లు సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.

వివేకానందరెడ్డికి గుండెపోటని ఎందుకు చెప్పానంటే


మరోవైపు అలకనంద మల్టీ ఆస్పత్రిలో జరిగిన కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని సీఐడీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కిడ్నీ రాకెట్‌పై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించగా... ఈ వ్యవహారంపై వైద్యులు ఇచ్చిన కమిటీ నివేదికను పరిశీలించారు. ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలు విరుద్ధంగా శస్త్ర చకిత్సలు జరిగాయని.. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటకకు చెందిన వ్యక్తులకు ఇందులో సంబంధం ఉందని వైద్యులు నివేదికలో తెలిపారు. ఆస్పత్రిని సీజ్ చేయడంతో పాటు, యజమానిని అరెస్ట్ చేసినట్లు మంత్రికి తెలిపారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న మంత్రి.. సీఐడీకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఉన్నవారందరికీ కఠిన శిక్ష తప్పదని మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి..

రేపు భారత మాతకు మహాహారతి

TDP on Vijayasai: విజయసాయి రాజకీయ సన్యాసంపై టీడీపీ ఫస్ట్‌ రియాక్షన్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 25 , 2025 | 01:48 PM