Miss England: మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలి: కేటీఆర్
ABN , Publish Date - May 25 , 2025 | 02:25 PM
మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. స్త్రీని శక్తిగా పూజించే తెలంగాణ గడ్డపై ఇలాంటి ఘటనలకు చోటు లేదన్న ఆయన, యావత్ తెలంగాణ సమాజం తరుపున క్షమాపణలు చెప్పారు.

ఇంటర్నెట్ డెస్క్: మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. స్త్రీని శక్తిగా పూజించే తెలంగాణ గడ్డపై ఇలాంటి ఘటనలకు చోటు లేదన్న ఆయన, యావత్ తెలంగాణ సమాజం తరుపున మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగికి క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ఇవాళ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్ లోనూ ఈ ఘటనపై స్పందించారు. తనను వేధించారని మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మహిళలను గౌరవించి, ఆరాధించే గొప్ప సంస్కృతి కలిగిన తెలంగాణ గడ్డపై మిల్లా మాగీ(Milla Magee) ఎదుర్కొన్న అనుభవం తనను ఎంతో బాధించిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఆడపిల్ల తండ్రిగా, ఏ మహిళకు ఇలాంటి దురదృష్టకర పరిస్థితి రాకూడదన్నారు. యావత్ తెలంగాణ సమాజం తరుపున మిల్లా మాగీకి హృదయ పూర్వకంగా క్షమాపణ చెబుతున్నట్టు తెలిపారు. ఆమెకు జరిగిన ఘటన తెలంగాణ స్ఫూర్తిని ప్రతిబింబించదన్న కేటీఆర్, అది తెలంగాణ ప్రజల విలువలకు వ్యతిరేకమన్నారు.
మహిళలకు సమాన అవకాశాలు కల్పించడాన్ని సంప్రదాయంగా భావించే తెలంగాణకు, రాణి రుద్రమ, చిట్యాల ఐలమ్మలే నిత్య స్ఫూర్తి ప్రదాతలు అని కేటీఆర్ చెప్పారు. మిస్ వరల్డ్(Miss England) వంటి అంతర్జాతీయ వేదికలపై జరిగే వేధింపులను ఎదిరించి నిలబడాలంటే అసాధారణ ధైర్యం ఉండాలన్న కేటీఆర్, మిల్లా మాగీ చూపిన తెగువ అభినందనీయమన్నారు. ఈ భయంకర అనుభవం నుండి ఆమె త్వరలోనే కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. మిల్లా మాగి చేసిన ఆరోపణలపై విచారణ జరపకుండా తెలంగాణ ప్రభుత్వం ఆమెనే దోషిగా నిలబెట్టాలనుకుంటుందని కేటీఆర్ ఆరోపించారు.
ఈ ఘటనపై ప్రభుత్వ వైఖరిని కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. సమగ్ర దర్యాప్తు జరిగి మిల్లా మాగీని వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ గట్టిగా కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజల ఆశీర్వాదంతో జరిగిన ఈ శుభకార్యం ఎప్పటికీ గుర్తుంటుంది..
సీఎం చంద్రబాబు కుటుంబం నూతన గృహప్రవేశం
For More AP News and Telugu News