HMDA: గ్రేటర్లో.. ఆరు స్కైవాక్‌లు..
ABN , Publish Date - Oct 23 , 2025 | 08:34 AM
గ్రేటర్ హైదరాబాద్‌లో మరో ఆరు స్కైవాక్‌లు రానున్నాయి. వీటిని వివిధ ప్రాంతాల్లో ప్రాధాన్యతా క్రమంలో నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్రాంతాలు రద్దీగా ఉండడం, పాదచారులు రోడ్డు దాట్టేందుకు ఇబ్బందులు పడడం, ఈ క్రమంలో ప్రమాదాలు, ట్రాఫిక్‌జామ్ అవుతున్నట్లుగా గుర్తించారు.
- రద్దీ ప్రాంతాల్లో నిర్మాణానికి శరవేగంగా ఎంపిక
- ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న హెచ్ఎండీఏ
- ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు
- అనుసంధానంగా నడక వంతెన
హైదరాబాద్ సిటీ: గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad)లో మరో ఆరు స్కైవాక్‌లు రానున్నాయి. వీటిని వివిధ ప్రాంతాల్లో ప్రాధాన్యతా క్రమంలో నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్రాంతాలు రద్దీగా ఉండడం, పాదచారులు రోడ్డు దాట్టేందుకు ఇబ్బందులు పడడం, ఈ క్రమంలో ప్రమాదాలు, ట్రాఫిక్‌జామ్ అవుతున్నట్లుగా గుర్తించారు. దాంతో అత్యవసరంగా అఫ్జల్‌గంజ్, మదీన, లక్డీకాపూల్ పెట్రోల్‌బంక్, బీహెచ్ఈఎల్, జేఎన్టీయూ, మియాపూర్ టీ జంక్షన్లలో స్కైవాక్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వం హెచ్ఎండీఏకు ఆదేశాలిచ్చింది.
ఇప్పటికే ఉప్పల్ స్కైవాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన హెచ్ఎండీఏ.. మెహదీపట్నం(Mehdipatnam)లో కూడా నిర్మాణ పనులు వేగవంతం చేసింది. సికింద్రాబాద్(Secunderabad)లో కూడా రైల్వేస్టేషన్‌కు, మెట్రో స్టేషన్లకు, బస్టాండ్లకు అనుసంధానంగా స్కైవాక్ నిర్మాణానికి హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. గతంలోనే లీ అసోసియేట్ అధ్యయనం చేసి నగరంలోని 23 ప్రాంతాల్లో స్కైవాక్‌లు అనివార్యమంటూ పీపీఆర్‌ను హెచ్ఎండీఏకు అందజేసింది.

ఇందులో ఉప్పల్ జంక్షన్(Uppal Junction)లో స్కైవాక్ నిర్మాణం పూర్తవ్వగా, మెహదీపట్నంలో పనులవుతున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station)కు అనుసంధానంగా స్కైవాక్ నిర్మాణానికి డీపీఆర్ తయారీకి కన్సల్టెన్సీని ఇప్పటికే నియమించారు. మిగతా 20 ప్రాంతాల్లో ఆరు స్కైవాక్‌లను ప్రాధాన్యతా క్రమంలో నిర్మించేందుకు నిర్ణయించి ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా హెచ్ఎండీఏను ప్రభుత్వం ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మరింత తగ్గింది..
మావోయిస్టు మద్దతుదారులపై నజర్!
Read Latest Telangana News and National News